Anasuya : అన‌సూయ ఒక్క ఎపిసోడ్‌కు.. రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

August 1, 2022 1:37 PM

Anasuya : బుల్లితెర‌పైనే కాకుండా వెండితెర‌పై స‌క్సెస్ సాధించిన యాంక‌ర్ల‌లో అన‌సూయ ఒక‌రు. ఇత‌ర ఏ యాంక‌ర్ కూడా సాధించ‌లేని సక్సెస్‌ను ఈమె సాధించింద‌ని చెప్ప‌వ‌చ్చు. బుల్లితెర‌పై యాంక‌ర్ గా చేస్తూనే సినిమాల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. ఈ క్ర‌మంలోనే ఈమె సినిమా కెరీర్‌లో న‌క్క తోక తొక్కింది. అనేక చిత్రాల్లో ఈమె న‌టించ‌గా.. అవ‌న్నీ హిట్ అయ్యాయి. దీంతో ఈమెకు వ‌రుస మూవీల్లో ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. మొద‌ట్లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల్లో న‌టించిన అన‌సూయ‌కు.. ఇప్పుడు సినిమాల్లో లీడ్ రోల్స్‌లో న‌టించే చాన్స్‌లు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే ఈమె గతంలో రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి ఆక‌ట్టుకుంది.

ఇక ఆ త‌రువాత పుష్పలో దాక్షాయ‌ణి పాత్ర‌లో హ‌ల్ చ‌ల్ చేసింది. ఇందులో నెగెటిల్ రోల్‌ను పోషించి షాకిచ్చింది. అలాగే ఖిలాడి మూవీలో గ్లామ‌ర్ డాల్‌గా కనిపించింది. ఇలా అన‌సూయ చేసిన ప్ర‌తి సినిమా హిట్ అవుతుండ‌డంతో ఈమెకు ఆఫ‌ర్లు కూడా అలాగే వ‌స్తున్నాయి. దీంతోఈమె బుల్లితెర‌ను వీడుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అలా జ‌ర‌గ‌లేదు కానీ జ‌బ‌ర్దస్త్‌కు మాత్రం గుడ్ బై చెప్పింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ చివ‌రి ఎపిసోడ్ ఇటీవ‌లే ప్ర‌సారం అయింది. అందులో ఆమె ఎమోష‌న‌ల్‌గా అంద‌రికీ వీడ్కోలు ప‌లికింది.

Anasuya taking huge remuneration for one episode
Anasuya

అయితే అన‌సూయ రెమ్యున‌రేష‌న్ కార‌ణంగానే జ‌బ‌ర్ద‌స్త్‌ను వీడింద‌ని తెలుస్తోంది. అందులో ఆమెకు ఒక ఎపిసోడ్‌కు రూ.3 ల‌క్ష‌ల మేర ఇచ్చేవార‌ట‌. కానీ జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లి మాటీవీలో చేరిన సుధీర్ లాంటి వాళ్ల‌కు ఏకంగా రూ.7 ల‌క్ష‌ల మేర పారితోషికం ల‌భిస్తుండ‌డంతో అన‌సూయ కూడా అక్కడికి వెళ్లింద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఒక ఎపిసోడ్‌కు రూ.6 ల‌క్ష‌లు ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. రెమ్యున‌రేష‌న్ వ‌ల్లే అంద‌రూ జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెడుతున్న‌ట్లు స‌మాచారం. ఇక అన‌సూయ కూడా అందుక‌నే జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెట్టింద‌ని అంటున్నారు. అయితే ఆమె కొత్త షోల‌లో ఎలా అల‌రిస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now