Anasuya : న‌న్ను తిడితే మీరే ప‌శ్చాత్తాప ప‌డ‌తారు.. కోర్టులో కేసు వేస్తా జాగ్ర‌త్త : అనసూయ

August 26, 2022 9:49 PM

Anasuya : జ‌బ‌ర్ద‌స్త్ ఫేమ్ అన‌సూయ సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిప్రాయాల‌ను చెప్ప‌డంలో ఎప్పుడూ వెన‌క‌డుగు వేయ‌దు. మ‌హిళ‌ల‌ను కించ ప‌రిచే వారిని ట్విట్ట‌ర్ లో ఘాటైన పోస్టులతో విమ‌ర్శించ‌డంలో ముందుంటుంది. ఇక తాజాగా సోష‌ల్ మీడియాలో త‌న‌ను హింసించే వారికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే త‌నను ట్విట్ట‌ర్ లో ఆంటీ అని కామెంట్ చేస్తూ, కార‌ణం లేకుండా త‌నని అస‌భ్యక‌ర‌మైన మాట‌ల‌తో వేధిస్తున్న వారి పోస్టుల స్క్రీన్ షాట్ తీసిన ఆమె వారంద‌రిపై కేసు న‌మోదు చేస్తాన‌ని, ఆ త‌ర్వాత త‌న జోలికి వ‌చ్చినందుకు వారు ప‌శ్చాత్తాప ప‌డాల్సి వ‌స్తుంద‌ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ లో పోస్టు చేసింది.

అయితే అంత‌కుముందు ఆమె లైగ‌ర్ సినిమాని ఉద్దేశిస్తూ.. అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా.. అని ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ ను ప‌రోక్షంగా విజ‌య్ దేవ‌రకొండను ఉద్దేశించి అన్న‌ట్టుగా అంద‌రూ భావిస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా స‌మ‌యంలో ఆయ‌న చేసిన వాఖ్య‌ల‌కు ఫ‌లితాన్ని ఇప్పుడు అనుభ‌విస్తున్న‌ట్టుగా ఆమె చేసిన ట్వీట్ వ‌ల‌న ఈ వివాదం మొద‌లైంది.

Anasuya strong warning to those who troll her
Anasuya

దీనిపై సోష‌ల్ మీడియాలో అన‌సూయకు వ్య‌తిరేకంగా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఎప్పుడో జ‌రిగిపోయిన విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట‌కు లాగి దాన్ని లైగ‌ర్ సినిమా ఫ్లాప్ తో ముడిపెట్ట‌డం, తోటి సినిమా వాళ్లు బాధ ప‌డుతుంటే ఆనందించ‌డం ఏంట‌ని ట్విట్ట‌ర్ లో అన‌సూయ‌ను ఆంటీ అని ఇంకా ర‌కర‌కాలుగా కామెంట్ చేస్తూ ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు.

అయితే ఇలా త‌న‌ను అకార‌ణంగా ఏజ్ షేమింగ్ చేస్తూ మాట‌ల‌తో హింసించే వారిపై లీగల్ చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సైబ‌ర్ సెల్ తో మాట్లాడినట్లుగా చెబుతూ ఇంకా ఎలాంటి యాక్ష‌న్ తీసుకోవాల‌నే విష‌యం గురించి చ‌ర్చిస్తున్న‌ట్టుగా, వారు త‌న‌కు హామీ ఇచ్చార‌ని ట్వీట్ చేసింది. అయితే ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now