Anasuya : అన‌సూయ ఒంటిపై ఉన్న టాటూలు ఏమిటో.. వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

July 10, 2022 3:53 PM

Anasuya : బుల్లితెర‌పై స‌క్సెస్‌ఫుల్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకున్న అన‌సూయ అటు సినిమాల్లోనూ న‌టిస్తూ త‌న స‌త్తా చాటుతోంది. రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించిన అనసూయ ఆ పాత్ర‌లో జీవించేసింది. దీంతో ఆ పాత్ర ఈమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. సినిమాల్లోనూ త‌న న‌ట‌న‌తో అల‌రిస్తున్న అన‌సూయ‌కు ఆఫ‌ర్లు కూడా అదేవిధంగా వ‌స్తున్నాయి. ఇక పుష్ప మూవీలో దాక్షాయ‌ణి పాత్ర‌లో అద‌ర‌గొట్టేసింది. తొలిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో న‌టించి అల‌రించింది. దీంతో త్వ‌ర‌లో ప్రారంభం అయ్యే పుష్ప 2లోనూ ఈమె న‌టించ‌నుంది.

అయితే అన‌సూయ శ‌రీరంపై రెండు చోట్ల టాటూలు ఉన్న సంగతి తెలిసిందే. ఛాతిపై ఎడ‌మ‌వైపు, ఎడ‌మ చేతి మీద మొత్తం రెండు టాటాలు ఉన్నాయి. ఛాతిపై నిక్కు అని ఆంగ్ల అక్షరాల‌తో టాటూ వేయించుకుంది. దీని అర్థం ఏమిటో ఆమె గ‌తంలోనే చెప్పేసింది. ట్విట్ట‌ర్‌లో ఆమె నెటిజ‌న్లతో గ‌తంతో ముచ్చ‌టించింది. దీంతో ఓ నెటిజ‌న్ ఆమెను ఛాతిపై ఉన్న టాటూకు అర్థం ఏమిట‌ని అడిగాడు. దీంతో అన‌సూయ నిక్కు అని బ‌దులిచ్చింది. త‌న భ‌ర్త‌కు ఉన్న ముద్దు పేరు అద‌ని తెలియ‌జేసింది. ఆమె భ‌ర్త పేరు సుశాంక్ భ‌ర‌ద్వాజ్ అన్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌ను నిక్కు అని పిలుచుకుంటాన‌ని చెప్పింది. అందుక‌నే ఆ టాటూ వేయించుకున్న‌ట్లు వివ‌రించింది.

Anasuya shareeram pacha bottu meaning
Anasuya

ఇక చేతిపై కూడా టాటూ ఉంటుంది. క‌లోన్ అనే ప‌దాన్ని టాటూగా మ‌నం చూడ‌వ‌చ్చు. ఇది వాస్త‌వానికి ఇంగ్లిష్ ప‌దం కాదు.. గ్రీక్ భాషకు చెందిన‌ది. దీన‌ర్థం.. స‌హ‌జ‌సిద్ధ‌మైన అందం అని వస్తుంది. అంటే మనుషుల బాహ్య అందాన్ని కూడా అంత‌ర్గ‌తంగా ఉండే అందాన్ని చూడాల‌ని.. అదే స‌హ‌జ‌సిద్ధ‌మైన, నిజ‌మైన అందం అని అర్థం. అంటే ఎవ‌రైనా రూపు రేఖ‌లు బాగా లేకున్నా మంచి మ‌న‌స్సు ఉంటే అలాంటి వారి గురించి చెప్పేందుకు ఆ ప‌దం వాడుతారు. అయితే దీన్ని మాత్రం ఎందుకు వేయించుకుందో అన‌సూయ చెప్ప‌లేదు. కానీ ఎప్పుడో ఒక‌సారి దీని గురించి కూడా ఎవ‌రైనా అడుగుతారు.. అప్పుడు ఈమె స‌మాధానం చెబుతుంది.. అప్ప‌టి వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now