Anasuya : గత కొంతకాలం వరకు జబర్దస్త్ షో లో యాంకర్ గా అందరినీ అలరించింది అనసూయ. అనసూయ యాంకర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జబర్దస్త్ షో ద్వారానే. గల గలా మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. ఇద్దరు పిల్లల తల్లి అయినా చెక్కుచెదరని అందంతోపాటు సినిమాలలోనూ, ఇటు బుల్లితెర ప్రేక్షకులనూ అలరిస్తోంది. అనసూయకు ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. మంచి టాలెంట్ తోపాటు, తనకు ఉండే సెల్ఫ్ రెస్‌పెక్ట్ తో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే మాట్లాడేస్తుంది అనసూయ. అనసూయకి సంబంధించి లేటెస్ట్ లుక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంటాయి.
అయితే తాజాగా అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ ద్వారా అనసూయ ఎన్నో విషయాలను వెల్లడించింది. బాడీ షేమింగ్ కామెంట్లు నచ్చకపోవడంతో నేను జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాను అంటూ పరోక్షంగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. భయపడుతూనే టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. నేను ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాను అంటేనే మా వాళ్ళలో చాలామంది వామ్మో ముఖానికి మేకప్ వేసుకున్నావా ఏంటి. అందరి ముందు అలా బట్టలు వేసుకొని కెమెరా ముందు నటిస్తావా.. అంటూ నన్ను గుచ్చి గుచ్చి అడిగేవారు.
కానీ నేను అలాంటి ప్రశ్నలను ఏమీ పట్టించుకోకుండా ధైర్యంగా నా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలని నా పని నేను చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాను. మొదట్లో నన్ను అందరూ విచిత్రంగా చూసేవారు. చచ్చినా తప్పుడు పనులు చెయ్యను అని ముఖం మీద చెప్పేదాన్ని . నేను ఎంచుకున్న దారి నాకు కంఫర్ట్ ని ఇచ్చింది. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నాకు నచ్చకపోయినా ఇష్టంగానే కొనసాగాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. మొదట్లో ఎంతో బాగున్న టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు కలుషితమై పోయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసే ఏ ఒక సందర్భాన్ని కూడా నేను సహించలేను. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాను.. అని పరోక్షంగా జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల కారణాన్ని చెప్పేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…