గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Anasuya : అన‌సూయ‌కు దారుణ‌మైన అవ‌మానాలు..? అందుక‌నే జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయిందా..?

Anasuya : గత కొంతకాలం వరకు జబర్దస్త్ షో లో యాంకర్ గా అందరినీ అలరించింది అనసూయ. అనసూయ యాంకర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జబర్దస్త్ షో ద్వారానే. గల గలా మాట్లాడుతూ ప్రేక్షకులను…

Anasuya : అన‌సూయ‌కు దారుణ‌మైన అవ‌మానాలు..? అందుక‌నే జ‌బ‌ర్ద‌స్త్ నుంచి వెళ్లిపోయిందా..?

Anasuya : గత కొంతకాలం వరకు జబర్దస్త్ షో లో యాంకర్ గా అందరినీ అలరించింది అనసూయ. అనసూయ యాంకర్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది జబర్దస్త్ షో ద్వారానే. గల గలా మాట్లాడుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేది. ఇద్దరు పిల్లల తల్లి అయినా చెక్కుచెదరని అందంతోపాటు సినిమాలలోనూ, ఇటు బుల్లితెర ప్రేక్షకులనూ అలరిస్తోంది. అనసూయకు ఉన్న క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు. మంచి టాలెంట్ తోపాటు, తనకు ఉండే సెల్ఫ్ రెస్‌పెక్ట్‌ తో ఉన్నది ఉన్నట్లు ముఖం మీదే మాట్లాడేస్తుంది అనసూయ. అనసూయకి సంబంధించి లేటెస్ట్ లుక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంటాయి.

అయితే తాజాగా అనసూయ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ ద్వారా అనసూయ ఎన్నో విషయాలను వెల్లడించింది. బాడీ షేమింగ్ కామెంట్లు నచ్చకపోవడంతో నేను జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నాను అంటూ పరోక్షంగా ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. భయపడుతూనే టీవీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. నేను ఈ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాను అంటేనే మా వాళ్ళలో చాలామంది వామ్మో ముఖానికి మేకప్ వేసుకున్నావా ఏంటి. అందరి ముందు అలా బట్టలు వేసుకొని కెమెరా ముందు నటిస్తావా.. అంటూ నన్ను గుచ్చి గుచ్చి అడిగేవారు.

Anasuya said why she left Jabardasth show
Anasuya

కానీ నేను అలాంటి ప్రశ్నల‌ను ఏమీ పట్టించుకోకుండా ధైర్యంగా నా ఫీల్డ్ లో సక్సెస్ అవ్వాలని నా పని నేను చేసుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాను. మొదట్లో నన్ను అందరూ విచిత్రంగా చూసేవారు. చచ్చినా తప్పుడు పనులు చెయ్యను అని ముఖం మీద చెప్పేదాన్ని . నేను ఎంచుకున్న దారి నాకు కంఫర్ట్ ని ఇచ్చింది. కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, నాకు నచ్చకపోయినా ఇష్టంగానే కొనసాగాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ. మొదట్లో ఎంతో బాగున్న టీవీ ఇండస్ట్రీ ఇప్పుడు కలుషితమై పోయిందని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అంతేకాకుండా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసే ఏ ఒక సందర్భాన్ని కూడా నేను సహించలేను. వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతాను.. అని పరోక్షంగా జబర్దస్త్ నుంచి బయటికి రావడానికి గల కారణాన్ని చెప్పేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి