Anasuya : ర‌వితేజ‌తో బాగా ఎంజాయ్ చేస్తూ న‌టించా: అన‌సూయ

February 11, 2022 9:11 AM

Anasuya : బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకున్న న‌టి, యాంక‌ర్‌ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెర‌పై అనేక షోస్ చేస్తూనే మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. ఇటీవ‌లే ఆమె న‌టించిన పుష్ప సినిమా విడుద‌ల కాగా అందులో ఆమె దాక్షాయ‌ణి పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. ఇక తాజాగా ర‌వితేజ సినిమా ఖిలాడిలోనూ అన‌సూయ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది.

Anasuya said she enjoyed acting with Ravi Teja
Anasuya

ర‌వితేజ హీరోగా, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రిలు హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం ఖిలాడి. ఈ మూవీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాకు ఎక్క‌డ చూసినా పాజిటివ్ టాక్ క‌నిపిస్తోంది. ర‌వితేజ ఇందులో ఎన‌ర్జిటిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడ‌ని సినిమా ట్రైల‌ర్‌ను చూస్తే స్ప‌ష్ట‌మైంది. ఇక ఈ మూవీలో డింపుల్ హ‌య‌తి త‌ల్లిగా అన‌సూయ చంద్ర‌క‌ళ పాత్ర‌లో న‌టించింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా ముచ్చ‌ట్ల‌ను అన‌సూయ పంచుకుంది.

ముఖ్యంగా అన‌సూయ ర‌వితేజ గురించి మాట్లాడుతూ.. ర‌వితేజ‌తో క‌లిసి ప‌నిచేయ‌డాన్ని తాను ఎంత‌గానో ఎంజాయ్ చేశాన‌ని తెలిపింది. ఆయ‌న‌తో ఎక్స్‌పీరియెన్స్ అదిరిందని, ఆయ‌న ఒక ఉత్త‌మ‌మైన న‌టుడ‌ని, ఆయ‌న‌ను చూస్తే త‌న‌కు ప్రాణాయామం చేసిన ఫీలింగ్ క‌లిగింద‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది. ఈ మూవీ కోసం ర‌వితేజ‌తో క‌లిసి చాలా రోజుల పాటు న‌టించినా.. ఆయ‌న ఇంత ఎన‌ర్జిటిక్ గా ఎలా ఉంటారో తెలుసుకోలేక‌పోయాన‌ని.. ఆ విష‌యం కూడా తెలుసుకుంటాన‌ని స్ప‌ష్టం చేసింది.

ఇక ఈ మూవీకి ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ఎ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై సత్యనారాయణ కోనేరు నిర్మించారు. అలాగే సీనియ‌ర్ హీరో అర్జున్ కీల‌క‌పాత్ర‌లో న‌టించారు. ఇందులో ర‌వితేజ డ్యుయ‌ల్ షేడ్‌లో న‌టించిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now