Anasuya : జ‌బ‌ర్ద‌స్త్ కు గుడ్ బై చెప్పిన అన‌సూయ‌.. బాధ‌గా ఉన్నా త‌ప్ప‌దంటోంది..!

June 29, 2022 4:42 PM

Anasuya : బుల్లితెర‌పై అత్యంత స‌క్సెస్‌ను సాధించిన షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్ నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ షో ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని వినోదాన్ని పంచుతూ వ‌స్తోంది. అయితే ఈ మ‌ధ్య కాలంలోఈ షో అనేక ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. క‌మెడియ‌న్లు రావ‌డం, పోవ‌డం ఈ షోకు స‌హ‌జ‌మే. కానీ ఇందులో ఎన్నో ఏళ్ల నుంచి కొన‌సాగుతున్న కీల‌క క‌మెడియ‌న్లు మాత్రం ఈ మ‌ధ్య దూర‌మ‌య్యారు. హైప‌ర్ ఆది, సుడిగాలి సుధీర్‌, గెట‌ప్ శ్రీ‌ను వంటి వారు జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌టకు వ‌చ్చేశారు. దీంతో షో క‌ళ త‌ప్పిపోయింది.

జ‌బ‌ర్ద‌స్త్‌కు రోజా దూర‌మైన‌ప్ప‌టి నుంచి ఒక్కొక్క‌రుగా ఈ షోను వీడిపోతున్నారు. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇత‌ర టీవీ చాన‌ల్స్ నుంచి ఎదుర‌వుతున్న పోటీ.. రెమ్యున‌రేష‌న్ వంటి అంశాల వ‌ల్లే ఒక్కొక్క‌రు ఈ షోకు గుడ్ బై చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ షోకు మ‌రో షాక్ త‌గిలింది. రంగ‌మ్మత్త‌గా పేరుగాంచిన అన‌సూయ ఈ షోకు గుబ్ బై చెప్పేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అందుకు ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇంత‌కీ అన‌సూయ అస‌లు ఏం పోస్ట్ చేసిందంటే..

Anasuya said bye to Jabardasth show
Anasuya

తాను త‌న కెరీర్‌లోనే చాలా కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని అన‌సూయ త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలియ‌జేసింది. ఎన్నో జ్ఞాప‌కాల‌ను త‌న వెంట తీసుకువెళ్తున్నాన‌ని, అందులో కొన్ని తీపి జ్ఞాప‌కాలు ఉండ‌గా.. కొన్ని చేదు జ్ఞాప‌కాలు ఉన్నాయ‌ని తెలియ‌జేసింది. తాను త‌న కెరీర్‌లో ఇంకా ముందుకు కొన‌సాగాల‌ని చూస్తున్నాన‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు అందించిన ఆద‌ర‌ణ‌ను కొన‌సాగిస్తార‌ని ఆశిస్తున్నాన‌ని.. అన‌సూయ పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పింద‌ని.. అందుక‌నే ఆ పోస్ట్ పెట్టి ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావ‌ల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now