Anasuya : మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చాన్స్ కొట్టేసిన అన‌సూయ‌..?

February 14, 2022 10:19 PM

Anasuya : బుల్లితెర స్టార్ యాంక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెరపై రాణిస్తూనే మ‌రోవైపు సినిమాల్లోనూ దూసుకుపోతోంది. ఈ మ‌ధ్య‌కాలంలో ఈమెకు సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. పుష్ప సినిమాలో దాక్షాయ‌ణిగా నెగెటివ్ రోల్‌లో ఈమె అల‌రించింది. అలాగే ఇటీవ‌ల విడుద‌లైన ఖిలాడి మూవీలోనూ న‌టించి ఆక‌ట్టుకుంది. ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. అన‌సూయ త్వ‌ర‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ న‌టిస్తుంద‌ని తెలుస్తోంది.

Anasuya reportedly got a chance to act in Chiranjeevi movie
Anasuya

మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం.. భోళా శంక‌ర్‌. ఇందులో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తోంది. అయితే ఈ మూవీలో అన‌సూయ‌కు ఓ కీల‌క‌పాత్ర‌ను ఇచ్చిన‌ట్లు స‌మాచారం. దీనిపై అధికారిక వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేదు. కానీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది.

ఇక అన‌సూయ సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ మ‌ధ్యే ఈమె అందాల‌ను ఒక రేంజ్‌లో ఆర‌బోసి ఓ సెల్ఫీ వీడియోను తీసుకుంది. దాన్ని త‌న ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది. అన‌సూయ అంత‌లా రెచ్చిపోయిందేమిటి.. అంటూ నెటిజ‌న్లు ఖంగు తిన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now