Anasuya : పుష్ప మూవీలో అన‌సూయ లుక్‌.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయిందా..?

November 11, 2021 5:26 PM

Anasuya : సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్‌, ర‌ష్మి మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా వ‌స్తున్న మూవీ పుష్ప. ఈ మూవీని రెండు పార్ట్‌లుగా తీస్తున్నారు. మొద‌ట పార్ట్ డిసెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో క‌నిపించ‌నున్న అన‌సూయ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పుష్ప మూవీలో అన‌సూయ దాక్షాయ‌ణిగా క‌నిపించ‌నుంది.

Anasuya look in pushpa movie not attracting says fans

అయితే దాక్షాయ‌ణి లుక్‌ను రివీల్ చేసిన‌ప్ప‌టికీ ఆ పోస్ట‌ర్‌ను బాగా ప‌రికించి చూస్తే త‌ప్ప ఆమె అన‌సూయ అని తెలియ‌డం లేద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. అన‌సూయ బ‌య‌టి లుక్‌ను, సినిమాలో లుక్‌ను పోల్చి బాగాలేద‌ని అంటున్నారు.

దాక్షాయ‌ణి లుక్‌లో అన‌సూయ విలేజ్ లేడీ క్యారెక్ట‌ర్‌లో ఉంది. బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి పాన్ న‌ములుతూ పోక వ‌క్క‌ల‌ను క‌ట్ చేస్తూ క‌నిపించింది. అయితే ఈ లుక్ అంత పెద్ద‌గా ఏమీ ఆక‌ర్ష‌ణీయంగా లేద‌ని ఫ్యాన్స్ అంటున్నారు. గ‌తంలో ప‌లు మూవీల్లో అన‌సూయ నాచుర‌ల్‌గా క‌నిపించింద‌ని, ఈ మూవీలో ఆమె లుక్ బాగా లేద‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు. మ‌రి పుష్ప మూవీలో అన‌సూయ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now