Anasuya : ఓటీటీలోకి వస్తున్న అనసూయ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

October 2, 2022 10:09 PM

Anasuya : దసరాకి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇక సినిమాల పరంగా ఎవరికి వాళ్లు.. అప్డేట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోనూ పలు కొత్త సినిమాలు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ దర్జా సినిమా కూడా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ఆహా ట్వీట్ చేసింది. మాస్ కథతో తీసిన ఈ సినిమాలో అనసూయతోపాటు సునీల్.. కీలకపాత్రల్లో నటించారు. పుష్ప తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. దీంతోపాటు ట్రైలర్ లో అనసూయ మాస్ గెటప్ లో కనిపించడం కూడా దర్జా ప్రీ రిలీజ్ బిజినెస్ కి ప్లస్ అయింది.

దర్జా మూవీలో అనసూయ కనకం అనే సారా వ్యాపారిగా నటించింది. తనకు అడ్డొచ్చిన పోలీసులను హతమార్చే డిఫరెంట్ పాత్రలో కనిపించి మెప్పించింది. దీనిని డైరెక్టర్ సలీమ్ మాలిక్ తెరకెక్కించారు. మూవీలో సునీల్ ప్రధాన పాత్రలో నటించాడు. లేడీ డాన్ గా అనసూయ, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ పెర్ఫామెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. అయితే రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఫెయిలైంది.

Anasuya latest movie darja on OTT
Anasuya

అయితే దసరా స్పెషల్ గా మూవీని ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అక్టోబర్ 5న స్ట్రీమింగ్ షురూ కానున్నట్టు ఆహా ప్రకటించింది. దీంతో అనసూయ, సునీల్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే అనసూయ వెండితెరపై వరుస చిత్రాల్లో విభిన్న‌ పాత్రల ద్వారా అలరిస్తూనే ఉంది. చివరిగా ఖిలాడి, పక్కా కమర్షియల్ చిత్రాల ద్వారా అలరించింది. ప్రస్తుతం పుష్ప: ది రూల్, రంగ మార్తాండ చిత్రాల్లో నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now