Anasuya : యాంకర్ అనసూయకు షాక్.. రాత్రికి రాత్రే ఏమైందబ్బా..!

October 12, 2021 11:39 AM

Anasuya : మొదటి నుంచి ఎంతో వివాదాలతో.. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎట్టకేలకు మా ఎన్నికలు పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియని ఉత్కంఠ నెలకొంది. ఫలితాల్లో మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ దూసుకెళ్లింది. తర్వాత మంచు విష్ణు ప్యానెల్ దూసుకెళ్లింది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో ఈసీ మెంబర్ గా ఉన్న యాంకర్ అనసూయ గెలిచినట్లు ప్రకటించారు.

Anasuya is very sad what happened over night

తర్వాత ఎవరు ఎన్నికల్లో గెలిచారు అనే దానిపై అధికారులు జాబితా రిలీజ్ చేశారు. అందులో అనసూయ పేరు లేకపోవడం గమనార్హం. మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల ఫలితాలపై యాంకర్‌ అనసూయ స్పందించింది. ఆమె ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించింది.

‘‘క్షమించాలి .. ఒక్క విషయం గుర్తొచ్చి తెగ నవ్వొస్తుంది .. మీతో పంచుకుంటున్న ఏమనుకోవొద్దే ..! నిన్న అత్యధిక మెజారిటీ” “భారీ మెజారిటీ” నుండి గెలుపు అని చెప్పిన వారు.. ఈరోజు “ఓడిపోయింది” “ఓటమి” అంటున్నారు .. రాత్రికి రాత్రి ఎంజరుగుంటుందబ్బా.. అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్‌ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్‌ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి.. ? అంటూ వరుస ట్వీట్లు చేసింది. ఉన్న 900 మంది ఓటర్లలో 600 మంది ఓట్లు వేశారు.

వాటిని లెక్కించడానికి రెండో రోజు కూడా పట్టిందా..? ఇలా ఎందుకు టైం పట్టినట్లు అర్థం గాక అడుతుతున్నా అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల అధికారి రిలీజ్‌ చేసిన మా విజేతల జాబితాలో అనసూయ పేరు లేకపోవడంతో ఆమె షాక్‌కి గురయ్యింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now