Anasuya : అటు బుల్లితెరపైనే కాకుండా ఇటు వెండి తెరపై కూడా అనసూయ దూసుకుపోతోంది. రంగస్థలం సినిమాలోనే కాక.. పలు ఇతర మూవీల్లోనూ తనదైన శైలిలో నటించి ఆకట్టుకుంది. దీంతో రంగమ్మత్తకు ఆఫర్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే అనసూయకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో అనసూయ ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అలాగే ఆమె మరో మూవీలో ఇంకో స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రవితేజ చాలా కాలం తరువాత క్రాక్ సినిమాతో హిట్ అందుకోగా.. ఆయన చేస్తున్న తదుపరి మూవీలో అనసూయ ఓ పాటలో అలరిస్తుందని తెలిసింది.
క్రాక్ సినిమా హిట్ జోష్‌లో ఉన్న రవితేజ ప్రస్తుతం ఫామ్‌లోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన ఖిలాడీ అనే మూవీలో నటిస్తున్నారు. ఇక నక్కిన త్రినాథ్ రావు దర్శకత్వంలోనూ రవితేజ ఓ మూవీ చేస్తున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందని తెలిసంది. ఈ సాంగ్ చేసేందుకు అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. త్వరలోనే ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…