Anasuya : అనసూయ చేయి తాకిందని.. తెగ సంతోష పడుతున్న అభిమాని..

December 27, 2021 4:03 PM

Anasuya : జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో ఫుల్ పాపులారిటీని సంపాదించ‌డ‌మే కాకుండా అందరి మ‌న‌సుల‌లోనూ చెర‌గ‌ని ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఇప్పుడు ఈమె బుల్లితెర‌పైనే కాకుండా వెండితెరపై కూడా పలు అవకాశాలను దక్కించుకుని తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.

Anasuya fan is very happy that her hand was touched him

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లింది. అనసూయని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. పోలీసులు కూడా రంగంలోకి దిగి జనాలను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అభిమానులు భారీగా పోటెత్తడంతో షాకైన అనసూయ.. వారిని నిరాశకు గురి చేయకూడదని కొందరికి ఫోటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

అయితే కొంద‌రికి ఆ అవ‌కాశం రాలేదు. కానీ ఓ అభిమానికి మాత్రం అన‌సూయ చేయి తాక‌డంతో తెగ ఆనందించాడు. అనసూయ తన చేతిని తాకిందంటూ సంబరాలు చేసుకున్నాడు. తన కలల రాణి చేతిని తాకిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిమాని అంతలా హ్యాపీ ఫీల్ అవ్వడంపై అనసూయ స్పందించింది. ‘అయ్యో శానిటైజ్ చేసుకోండి’ అని అతడిని సరదాగా ఆటపట్టించింది. అన‌సూయ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now