Anasuya : ఫ్లైట్‌లో అనసూయ డ్రెస్ చిరిగిందట.. ఎయిర్‌పోర్టులో దారుణమైన అవమానం..!

October 18, 2022 6:13 PM

Anasuya : యాంకర్ అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక విషయం మీద అనసూయ స్పందిస్తుంటుంది. అది కాంట్రవర్సీకి దారి తీస్తుంది. దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రోలర్ల మీద అనసూయ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంది. ఇదొక సర్కిల్‌లా నిత్యం జరుగుతూనే ఉంటుంది. ట్రోలింగ్ ఎంత జరుగుతున్నా కూడా అనసూయ మాత్రం వెనక్కి తగ్గదు. అలా అనసూయ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ వేస్తూనే ఉంటుంది.

తాజాగా అనసూయ తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఇందులో ఎయిర్ పోర్ట్‌లో విమానాయాన సంస్థ చేసిన పనుల గురించి పేర్కొంది. బెంగుళూరు నుండి హైదరాబాద్ కి అనసూయ కుటుంబ సభ్యులతో పాటు ప్రయాణమయ్యింది. దీనికోసం ఆమె ఒక ఎయిర్ లైన్స్ సంస్థలో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంది. టికెట్ లో ఉన్న సమయం కంటే ముందే ఎయిర్ పోర్ట్ కి రావాలని ఎయిర్ లైన్ సంస్థ వారు సందేశం పంపారట. ఎయిర్ పోర్ట్ కి వెళ్ళాక మాస్క్ లు లేవని లోపలి పంపలేదట.

Anasuya explained about recent insulting incident in a flight
Anasuya

మాస్క్ లు ధరించి ఫ్లైట్ లోపలికి వెళ్లగా.. సీట్లు ఒకచోట కాకుండా వేరువేరుగా కేటాయించారట. వరుసగా సీట్లు బుక్ చేస్తే వేరు వేరుగా ఎలా కూర్చోబెడతారని అనసూయ అడిగితే సమాధానం లేదట. పైగా అనసూయ కూర్చున్న సీటు సరిగా లేదట. చిరిగిపోయి ఉండటం వలన పదునైన వస్తువు తాకి ఆమె చొక్కా చిరిగి పోయిందట. ఎయిర్ పోర్ట్ తో పాటు ఫ్లైట్ లో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులు వివరిస్తూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ వైరల్ అవుతుంది. మరి అనసూయ సందేశానికి సదరు ఎయిర్ లైన్స్ సంస్థ సమాధానం ఇస్తారో లేదో చూడాలి..

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now