Anasuya Bharadwaj : రిప‌బ్లిక్ డే వివాదంలో అన‌సూయ‌.. జాతీయ గేయాన్ని కూర్చుని పాడుతావా.. అంటూ నెటిజ‌న్ల ఆగ్ర‌హం..

January 26, 2022 10:21 PM

Anasuya Bharadwaj : బుల్లితెర యాంక‌ర్‌గా రాణిస్తూనే సినిమాల్లోనూ త‌న స‌త్తా చాటుతున్న యాంక‌ర్ అన‌సూయ‌ను ఎల్ల‌ప్పుడూ వివాదాలు చుట్టుముడుతుంటాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ఎల్ల‌ప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె మ‌రోమారు వివాదంలో చిక్కుకుంది. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జాతీయ గేయాన్ని ఆమె కూర్చుని పాడిందంటూ.. నెటిజ‌న్లు ఆమెపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Anasuya Bharadwaj in republic day controversy netizen criticize her

భార‌త గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అన‌సూయ చేసిన ప‌నికి నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆమె ఈ వివాదంపై స్ప‌ష్ట‌త‌ను ఇద్దామ‌నుకుంది. కానీ నెటిజ‌న్లు మాత్రం ఆమెను విమ‌ర్శించ‌డం ఆప‌డం లేదు. అన‌సూయ జాతీయ గేయాన్ని నిలుచుని పాడ‌కుండా కుర్చీలో కూర్చుని పాడింది. అది ఆమె చేసిన త‌ప్పు. వాస్త‌వానికి మ‌న జాతీయ గీతం లేదా గేయం ఏదైనా స‌రే పాడిన‌ప్పుడు క‌చ్చితంగా వాటిని గౌర‌విస్తూ లేచి నిలుచోవాల్సిందే. కానీ అన‌సూయ అలా చేయ‌కుండా కూర్చోవ‌డంపై వివాదం చెల‌రేగుతోంది.

ఇక గ‌ణ‌తంత్ర దినోత్స‌వం అంటే అంబేద్క‌ర్ బొమ్మ వేసుకోవాలి కానీ టీష‌ర్టుపై గాంధీ బొమ్మ ఏమిట‌ని కూడా కొంద‌రు ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో స్పందించిన అన‌సూయ కామెంట్ పెట్టింది.

అరే.. ఏందిరా భాయ్‌ మీ లొల్లి.. నేషనల్‌ యాంథెమ్‌ అంటారు. గాంధీకి, కాన్‌స్టిట్యూషన్‌ కి సంబంధమేందంటారు.. మరి జన గణ మణ ఏంది ? ఆగస్టు 15, 1947 అయితేనే 26 జనవరి 1950 అయింది. కొంచెం బుర్ర అద్దెకు తెచ్చుకోనన్నా.. మాట్లాడుర్రి.. హ్యాపీ రిపబ్లిక్‌ డే మరి.. అంటూ అనసూయ పోస్ట్‌ పెట్టింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

అయిన‌ప్ప‌టికీ ఆమెపై ట్రోలింగ్ ఆగ‌డం లేదు. ఎల్ల‌ప్పుడూ ఏదో ఒక విధంగా వార్త‌ల్లో ఉండే అన‌సూయ‌కు ఇది త‌ల‌నొప్పిగా మారింది. మ‌రి ఈ విష‌యం ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now