Anasuya : నేను లావు అయితే మీకేంటి.. అనసూయ ఫైర్..!

December 25, 2021 5:19 PM

Anasuya : టాప్ యాంక‌ర్‌గా, న‌టిగా దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. ఈ అమ్మ‌డు ఒక‌వైపు టీవీ షోల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు సినిమాలు చేస్తోంది. రీసెంట్‌గా పుష్ప చిత్రంలో దాక్షాయ‌ణి అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది. సుకుమార్, రామ్ చరణ్ ల కాంబోలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అదరగొట్టింది అనసూయ. ఈ సినిమాతో అనసూయ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

Anasuya angry on those youtube channels who said she has gain weight

పుష్ప నుంచి ఇటీవ‌ల విడుదలైన అనసూయ పోస్టర్స్ పై బాడీ షేమింగ్ చేశాయి పలు యూట్యూబ్ ఛానల్స్. దీనిపై అన‌సూయ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. నేను లైవ్ లోకి వచ్చానంటే అందరికీ చాలా కంగారుగా ఉంటుంది. ఇప్పుడేం క్లాసులు పీకుతుందో అని. నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్ నెయిల్స్ చూశాను. వాటిని పట్టించుకోకూడదని అనుకుంటా, కానీ.. అన్ని సందర్భాల్లోనూ ఇంతే స్ట్రాంగ్ గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి.

ఎంత లావు అయిపోయిందో చూడండి.. ఓవర్ వెయిట్.. షాకింగ్.. లాంటి థంబ్ నెయిల్స్ పెట్టారు. మంచి వాటినే చదివి వాళ్లతోనే షేర్ చేసుకోవాలని అనకుంటున్నాను.. నేను వెయిట్ పెరిగాను.. ఈ సందర్భంలో మీ క్యారెక్టర్.. మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లను అడుగుతున్నా.. నేను కూడా మీలాగే మాట్లాడగలను.. హర్ట్ చేయగలను, కానీ అది నా వ్యక్తిత్వం కాదు.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. ప్ర‌స్తుతం ఈ జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ స్ట‌న్నింగ్ కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now