Ananthapuram : అత్తారింటికి వెళ్లాల్సిన నవవధువు.. అనంతలోకాలకు..

December 1, 2021 6:30 PM

Ananthapuram : వివాహం తర్వాత వ‌ధువు ఎన్నో ఆశలతో తన జీవితం ఎంతో అద్భుతంగా, సంతోషంగా ఉండాలని భావించి అత్తారింట్లో అడుగు పెడుతుంది. కానీ ఈ నవవధువు మాత్రం కాళ్ల పారాణి ఆరకముందే అత్తారింటికి కాకుండా అనంతలోకాలకు వెళ్ళింది. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన పది రోజులకే ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే..

Ananthapuram : అత్తారింటికి వెళ్లాల్సిన నవవధువు.. అనంతలోకాలకు..

బుక్కరాయసముద్రం మండలం గ్రామ సచివాలయం 2 లో పని చేస్తున్న సుజన అనే అమ్మాయికి, చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన విశ్వనాథ్ తో నవంబర్ 17వ తేదీన‌ వివాహం జరిగింది. వేదమంత్రాల సాక్షిగా.. బంధు మిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వివాహం తరువాత పుట్టింటికి వచ్చిన సుజన గత పది రోజుల నుంచి పుట్టింటిలోనే ఉంటూ విధులకు వెళుతోంది.

ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యులు ఆమెను అత్తవారింటికి పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సోమవారం యథావిధిగా విధులకు వెళ్లి వచ్చిన సుజన అనంతరం బాత్‌రూంలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పెళ్లి అయిన పది రోజులకే ఈమె ఆత్మహత్యకు పాల్పడటంతో కారణాలు ఏమిటని ఆరా తీస్తున్నారు. అయితే తమ కూతురికి తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టమని వారిని విడిచిపోలేకే ఈ విధమైన నిర్ణయం తీసుకుందని.. కుటుంబసభ్యులు తెలియజేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now