Amir Khan : బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్‌పై నెటిజ‌న్ల తీవ్ర ఆగ్ర‌హం.. కార‌ణం అదే..!

October 21, 2021 10:45 PM

Amir Khan : ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ కేసులో ఇప్ప‌టికే బాలీవుడ్‌పై అనేక విమర్శ‌లు, ట్రోల్స్ వ‌స్తున్నాయి. అది చాల‌ద‌న్న‌ట్లు తాజాగా ఇంకో వివాదం వారి వైపు వేలెత్తి చూపిస్తోంది. ముఖ్యంగా న‌టుడు అమీర్‌ఖాన్ చేసిన ఓ యాడ్ పెను దుమారం రేపుతోంది.

Amir Khan  diwali ad creating controversy netizen angry over him

దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా కొంద‌రు ర‌హ‌దారుల‌పై కూడా బాణ‌సంచా కాలుస్తుంటారు. అయితే ఈ అంశం నేప‌థ్యంలో అమీర్ ఖాన్ సియ‌ట్ కంపెనీ తీసిన ఓ యాడ్‌లో న‌టించారు. అందులో పిల్ల‌లు బాణ‌సంచాను రోడ్డుపై కాలుస్తుంటారు. అమీర్ బ‌య‌ట‌కు వ‌చ్చి.. రోడ్లు ఉన్న‌వి వాహ‌నాల‌కు, ప‌టాకులు కాల్చ‌డానికి కాదు.. అని చెబుతాడు.

https://twitter.com/SharwanKumarVi6/status/1451186193538772993?s=20

https://twitter.com/ITISTANMAY56/status/1451180228798140422?s=20

అయితే దీపావ‌ళి గురించే అమీర్ ఎందుకు ఇలా చెబుతున్నారు ? ఎంతో మంది ముస్లింలు రోడ్ల మీద కూడా న‌మాజ్ చేస్తారు క‌దా ? అప్పుడు వాహ‌నాలను ఆప‌డం గుర్తుకు రావ‌డం లేదా ? అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే సియ‌ట్ టైర్స్ కంపెనీని కూడా ఈ యాడ్ తీసినందుకు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now