Ambassador : మార్కెట్‌లోకి మళ్లీ వస్తున్న ఒకప్పటి అంబాసిడర్‌ కార్‌.. ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే..?

Ambassador : అప్పట్లో.. అంటే 1970, 1980లలో హిందూస్థాన్‌ మోటార్స్‌కు చెందిన అంబాసిడర్ కారు ఒక ఊపు ఊపింది. కార్‌ మార్కెట్‌లో ఈ కార్లది అప్పట్లో 75 శాతం వాటా. ఈ విషయం ఒక్కటి చాలు.. అప్పట్లో అంబాసిడర్‌ కార్లు ఎంతటి ఆదరణను పొందాయో చెప్పడానికి. అయితే మార్కెట్‌లోకి మారుతి సుజుకితోపాటు ఇతర కారు సంస్థలు రావడం.. ఆధునిక ఫీచర్లతో కార్లను తయారు చేసి అందించడంతో.. అంబాసిడర్‌ కారుకు రాను రాను ఆదరణ తగ్గింది. అప్పట్లో దీన్ని రాజకీయ నాయకులు ఎక్కువగా వాడేవారు. అయితే అంబాసిడర్‌ కారు త్వరలోనే మళ్లీ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఈ మేరకు హిందూస్థాన్‌ మోటార్స్‌ ప్రణాళికలు రచిస్తోంది.

చివరి అంబాసిడర్‌ కారును 2014లో డెలివరీ చేయగా.. అప్పటికే కంపెనీ తీవ్రమైన నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో అంబాసిడర్ బ్రాండ్‌ను గ్రూప్‌ పీఎస్‌ఏ అనే కంపెనీకి విక్రయించారు. అయితే ఇప్పుడు సీకే బిర్లా గ్రూప్ అనే సంస్థతో హిందూస్థాన్‌ మోటార్స్ భాగస్వామ్యం అయింది. దీంతో త్వరలోనే అంబాసిడర్‌ను మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Ambassador

ఇక కొత్త మోడల్‌కు చెందిన కారు డిజైన్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత అంబాసిడర్‌లోని ఫీచర్లతోపాటు లుక్‌ను కూడా కొత్త డిజైన్‌లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఫొటోలను అధికారికంగా విడుదల చేయలేదు. వీటిని ఒక ఆర్టిస్టు ఊహించి రూపొందించాడు. కనుక ఇప్పటికైతే డిజైన్‌ పరంగా ఇవి అనధికారిక ఫొటోలే అని చెప్పవచ్చు. కాగా కొత్త మోడల్‌ను ఎలక్ట్రిక్‌ వేరియెంట్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. అందులో నలుగురు కూర్చుని వెళ్లేలా సీటింగ్‌ సామర్థ్యం ఉంటుందట. దీంతోపాటు 1200 సీసీ ఇంజిన్‌, 5 ఆటోమేటిక్‌ గేర్స్‌, ఇతర ఆధునిక సదుపాయాలు కొత్త అంబాసిడర్ లో ఉంటాయని తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM