Amazon : అమెజాన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ షురూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా.. భారీ తగ్గింపు ధరలకు స్మార్ట్‌ ఫోన్లు..

September 22, 2022 10:20 AM

Amazon : ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ సేల్‌ను ప్రారంభించింది. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ సేల్‌ను ప్రారంభించినట్లు తెలియజేసింది. అయితే ఈ సేల్‌ శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుంది. కానీ ప్రైమ్‌ మెంబర్లకు గురువారం నుంచే అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సేల్‌ ముగింపు తేదీని అమెజాన్‌ ప్రకటించలేదు. కానీ అక్టోబర్‌ 30 వరకు కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ సేల్‌లో భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లపై గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. అలాగే ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఆడియో ప్రొడక్ట్స్‌పై కూడా భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ సేల్‌లో యాపిల్‌ ఐప్యాడ్‌ 2021 మోడల్‌ను రూ.25,999 ధరకు కొనవచ్చు. అలాగే ఐఫోన్‌ 13 ప్రొ రూ.99వేలకు లభిస్తుంది. యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ రూ.22,900కు, ఐఫోన్‌ 12 రూ.40వేలకు లభిస్తున్నాయి.

Amazon great indian festival sale 2022 started offers huge discounts
Amazon

ఈ సేల్‌లో శాంసంగ్‌, వన్‌ప్లస్‌, ఐక్యూ వంటి కంపెనీలకు చెందిన ఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. ఎస్‌బీఐ కార్డులతో కొంటే 10 శాతం అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. రూ.500 విలువ గల కూపన్‌ కోడ్‌లను ఉచితంగా పొందవచ్చు. దీంతోపాటు అదనపు ఎక్స్ఛేంజ్‌ డిస్కౌంట్‌లను కూడా అందిస్తున్నారు. దీంతో ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now