Guava Leaves : జామ ఆకుల‌ను తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. వీటి లాభాలు తెలిస్తే అస‌లు విడిచిపెట్ట‌రు..

Guava Leaves : మ‌న‌కు సీజ‌న‌ల్‌గా ల‌భించే అనేక ర‌కాల పండ్ల‌లో జామ పండ్లు కూడా ఒక‌టి. కొంద‌రు వీటిని ప‌చ్చిగా ఉండ‌గానే తింటారు. అయితే ఇవి సాధార‌ణంగా మ‌న‌కు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. అందుక‌నే దీన్ని పేద‌వాడి ఆపిల్ అని పిలుస్తారు. ఇక జామ‌కాయ‌ల వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే వాటితోపాటు జామ ఆకులు కూడా మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జామ పండ్లే కాదు, జామ ఆకులు కూడా డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. జామ ఆకులతో తయారు చేసిన టీని 19 మందికి నిత్యం ఇచ్చి సైంటిస్టులు పరిశోధనలు చేశారు. దీంతో ఆ టీ తాగిన వారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని గుర్తించారు. అందువల్ల డయాబెటిస్‌ ఉన్నవారు జామ ఆకులతో టీ తయారు చేసుకుని తాగితే మంచిది. జామ ఆకులను తిన్నా, ఆ ఆకులతో తయారు చేసిన టీని తాగుతున్నా శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు కూడా. దీని వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

Guava Leaves

మహిళలు రుతు సమయంలో జామ ఆకులను తీసుకోవడం వల్ల వారికి తీవ్రమైన నొప్పి సమస్య తగ్గుతుందని సైంటిస్టులు తేల్చారు. ఇందుకు గాను వారు 197 మందికి జామ ఆకుల నుంచి తీసిన పదార్థాలను నిత్యం 6 మిల్లీగ్రాముల మోతాదులో ఇచ్చారు. దీంతో రుతు సమయంలో వారికి చాలా వరకు నొప్పి సమస్య తగ్గిందని గుర్తించారు. జామ ఆకుల్లో ఉండే పోషకాలు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. జామ ఆకుల్లో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు జీర్ణాశయంలో సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. అలాగే డయేరియా సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనాలు అవుతున్న వారు జామ ఆకులను తింటే ప్రయోజనం ఉంటుంది.

జామ ఆకుల్లో యాంటీ క్యాన్సర్‌ గుణాలు ఉంటాయి. అందువల్ల ఆ ఆకులను తింటే క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అలాగే వాటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో వ్యాధులు రాకుండా ఉంటాయి. క్యాన్సర్‌ కణాలు పెరగకుండా ఉంటాయి. జామ పండ్లే కాదు, జామ ఆకుల్లోనూ విటమిన్‌ సి ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయట పడేస్తుంది. జామ ఆకులను సేకరించి పేస్ట్‌ రూపంలో వాటిని తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని చర్మంపై రాస్తే చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి. చర్మం సురక్షితంగా ఉంటుంది. ఇలా జామ ఆకుల‌తో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM