Pears : ఈ పండు దొరికితే అసలు వదలకండి..! ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది అద్భుతమైన ఆహారం..!

August 29, 2022 5:54 PM

Pears : ఈ పండు మనకి వర్షాకాలంలో అధికంగా లభిస్తుంది. ప్రజలు ఈ పండును తినడానికి పెద్దగా ఆసక్తి చూపించ‌రు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆరోగ్య ప్రేమికులు ఎవరూ తినకుండా ఉండలేరు. ఆ పండే పియర్స్.  ఈ పియర్స్ ను తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ తియ్యగా, ఎక్కువగా ఫైబర్ ఉండే పండు ఇది. అంతేకాకుండా దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా పోషకాలు కలిగి ఉంటాయి. అధిక బరువు ఉన్నవాళ్లు ఈ పండ్లు తినడం వల్ల ఫైబర్ శరీరానికి అందుతుంది.

అంతేకాకుండా డయాబెటిస్ పేషెంట్లు కూడా పియర్స్ ను చక్కగా తినవచ్చు. డయాబెటిస్ పేషెంట్స్ లో చక్కెర స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహకరిస్తుంది. ఈ పండులో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్, విటమిన్ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం, కాపర్, ఫైబర్, ఫోలేట్ తదితర పోషక విలువలు పియర్స్ లో అధికంగా ఉంటాయి. అందువల్ల, రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి  హిమోగ్లోబిన్ స్థాయిల‌ని పెంచడమే కాకుండా ఎనర్జీ లెవల్స్ ను పెంచడంలో కూడా సహాయపడే పోషకాలు ఈ పండ్ల‌లో పుష్కలంగా ఉంటాయి. ఈ పండును నిత్యం ఆహారంగా తీసుకోవడం వల్ల రోజంతా ఎంతో శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు.

amazing health benefits of eating Pears
Pears

ఈ పండ్లు మీ చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కూడా ఉంచుతాయి. పియర్స్ లో ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా పియర్స్ పండ్లను తినడం వల్ల కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయకుండా బరువును నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడుతాయి. ఈ పండులో ఉండే పోషక విలువలు వలన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. క‌నుక ఏ విధంగా చూసుకున్నా కూడా అనేక అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి కాబ‌ట్టి ఈ పండ్ల‌ను తిన‌డం అస‌లు మిస్ చేసుకోకండి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now