Aloe Vera Farming : ఆలోచన ఉండాలే కానీ సంపాదించే మార్గం అదే వస్తుంది. దానికి కాస్త శ్రమను జోడిస్తే చాలు.. ఆదాయం అదే వస్తుంది. ఇలా ఎంతో మంది ఎన్నో ఉపాధి మార్గాలను పొందుతూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు. అలాగే అతను కూడా మొదట్లో ఆందోళన చెందాడు. కానీ ఇప్పుడు ఏడాది లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తున్నాడు. అతను ఒకప్పుడు టీ అమ్మేవాడు. కానీ ఇప్పుడు కలబంద పంటను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాడు. అతనే రాజస్థాన్‌కు చెందిన అజయ్ స్వామి.
అజయ్ స్వామికి తండ్రి నుంచి సంక్రమించిన 0.66 ఎకరాల భూమి ఉంది. కానీ దాన్ని అతను ఉపయోగించేవాడు కాదు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో అతను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషించ సాగాడు. రాజస్థాన్ లోని హనుమాన్ గడ్ జిల్లా పర్లిక అనే గ్రామంలో అతను నివాసం ఉంటున్నాడు. అయితే ఒక రోజు అతను పేపర్‌లో కలబంద సాగుపై వచ్చిన కథనాన్ని చదివాడు. దీంతో తనకు ఉన్న భూమిలో కలబందను సాగు చేయాలని అనుకున్నాడు. వెంటనే తన గ్రామంతో శ్మశాన వాటికతోపాటు అక్కడక్కడా ఉన్న కలబంద మొక్కలను సేకరించి తన పొలంలో మళ్లీ వాటిని నాటాడు.
అయితే కలబంద మొక్కలను అయితే నాటాడు. కానీ మరోవైపు పంట చేతికి వస్తుందా.. లేదా.. అని టీ వ్యాపారాన్ని కొనసాగించాడు. కానీ సంవత్సరం తిరిగే లోపు పంట వచ్చింది. అయితే వచ్చిన పంటను అమ్మడం ఎలా అని పరిశోధించాడు. కలబందను జ్యూస్ చేసి అమ్మితే బాగా లాభాలు ఉంటాయని తెలుసుకుని కాస్త అప్పు చేసి అందుకు కావల్సిన యంత్రాలను కొని జ్యూస్ తీసి అమ్మాడు. దీంతో లాభాలు వచ్చాయి. ఇక అప్పటి నుంచి అజయ్ స్వామి వెను తిరిగి చూడలేదు. కలబంద సాగునే జీవన మార్గంగా మలచుకుని లాభాలను గడించసాగాడు.
అలా అతను 2012లో తాను చేస్తున్న టీ వ్యాపారానికి స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో కలబందను పండించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే సొంత ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి కలబంద ఉత్పత్తులను తన ఫ్యాక్టరీలోనే తయారు చేసి విక్రయించడం మొదలు పెట్టాడు. సబ్బులు, షాంపూలతోపాటు, జ్యూస్, ఆహార ఉత్పత్తులను కూడా చేసి అమ్మసాగాడు. దీంతో లాభాలు వచ్చాయి. అలా అజయ్ స్వామి తన భూమిలో కలబంద సాగు చేస్తూ ఏడాదికి రూ.10 లక్షలకు పైగానే సంపాదిస్తున్నాడు. ఇది చాలా లాభసాటిగా ఉందని చెబుతున్నాడు.
కలబందను సాగు చేసేందుకు నీళ్లు కూడా ఎక్కువగా అవసరం ఉండవని అంటున్నాడు. పంట 6 నుంచి 12 నెలల్లో చేతికి వస్తుంది. సొంతంగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ప్రాసెసింగ్ చేసి వివిధ రకాల అలొవెరా ఉత్పత్తులను సొంతంగా విక్రయించవచ్చు. అలా చేసిన ఉత్పత్తులను అనేక కంపెనీలు తన నుంచి కొంటున్నాయని అజయ్ స్వామి తెలియజేశాడు. ఇక అర ఎకరం స్థలంలో సుమారుగా 1500 వరకు మొక్కలను పెంచి మంచి లాభాలను పొందవచ్చని చెబుతున్నాడు. నిజంగా ఇలా చేస్తే ఎవరైనా లాభాలను పొందవచ్చని అంటున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…