Allu Sneha Reddy : అల్లు స్నేహా రెడ్డి కోసం ఎంతో కష్టపడిన డిజైనర్ ప్రీతమ్..!

November 7, 2021 10:08 PM

Allu Sneha Reddy : డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. సమంత విడాకుల తర్వాత ఎక్కువగా వినిపించిన పేర్లలో ప్రీతం పేరు ఒకటి. సమంత విడాకులకు కారణం తన డిజైనర్ ప్రీతమ్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందుకు గల కారణం గతంలో సమంత షేర్ చేసిన ఫోటో అని చెప్పవచ్చు. ఇలా ఈ వ్యవహారం విడాకుల వరకు వెళ్ళిందని.. తన విడాకులకు కారణం ప్రీతమ్ అంటూ సోషల్ మీడియాలో అతని పేరు మారుమోగిపోయింది.

Allu Sneha Reddy got designer dress from preetham jukalkar

ఇలా ఎంతో ఫేమస్ అయిన ప్రీతమ్ కేవలం సమంతకు మాత్రమే కాకుండా రకుల్, అల్లు స్నేహారెడ్డి వంటి వారికి కూడా దుస్తులను డిజైన్ చేస్తాడని తెలిసిందే. ఈ క్రమంలోనే దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రీతమ్ అల్లు స్నేహా రెడ్డికి అదిరిపోయే డ్రెస్ ను డిజైన్ చేశారు. అల్లు స్నేహారెడ్డి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తాజాగా ఈ ఫోటోని షేర్ చేసిన స్నేహా రెడ్డి తన డ్రెస్ ను డిజైనర్ ప్రీతమ్ డిజైన్ చేశాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటోపై నటి శ్రియ స్పందించింది. శ్రియ ఈ ఫోటోపై స్పందిస్తూ.. టూ హాట్.. అంటూ కామెంట్ చేయగా అందుకు స్నేహారెడ్డి థాంక్యూ.. అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now