Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వ్యాపారం చేసి ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

November 28, 2022 9:42 AM

Allu Sneha Reddy : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలే వేరు. గంగోత్రి చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై ఇత‌ను హీరోనా అనే రేంజ్ నుంచి హీరో అంటే ఇలా ఉండాలి అనే రేంజ్ కి ఎదిగాడు అల్లు అర్జున్. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. సుకుమార్ దర్శకత్వంలో ఆర్య చిత్రంతో యువత మనసులను కొల్లగొట్టాడు అల్లు అర్జున్.

ఆ తరువాత బద్రీనాథ్, దేశముదురు, జులాయి వంటి చిత్రాలతో రేసుగుర్రంలా దూసుకుపోతూ అగ్రస్థాయి హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలాంటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా స్టైలిష్ గానే ఉంటుంది. సుకుమార్ డైరెక్షన్లో పుష్ప చిత్రంతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ దేశవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాడు.

Allu Sneha Reddy business do you know how much she earns
Allu Sneha Reddy

ఇక బన్నీ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే 2011 లో స్నేహరెడ్డిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆమె తండ్రి కె.పి.ఎస్ రెడ్డి తెలంగాణాలోనే పెద్ద విద్యావేత్త. రియల్ ఎస్టేట్ లో కూడా బాగా సంపాదించారు. కె.పి.ఎస్ రెడ్డి ఒకదశలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ఆతర్వాత రియల్ ఎస్టేట్ ద్వారా భూములు విక్రయించి వేలకోట్లు సంపాదించాడు. దాంతో 25 ఏళ్ళ క్రితం సాధారణంగా ఉన్న స్నేహారెడ్డి కుటుంబం ఒక్కసారిగా కోట్లకు పడగలెత్తింది.

దాంతో కె.పి.ఎస్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంజనీరింగ్ ,ఫార్మసీ కాలేజీలు నెలకొల్పి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో సెటిల్ అయ్యారు. ఈ కాలేజీ వ్యవహారాలను స్నేహ రెడ్డి  చూసుకుంటుంది.   ఇక బన్నీతో స్నేహరెడ్డి పెళ్ళికి దాదాపు 100కోట్లు కట్నం రూపంలో సమర్పించుకున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. ఇక వీటికి తోడు సిటీలో విలువైన ఆస్తులను కుమార్తెకు పెళ్ళి కానుకగా రాసి ఇచ్చాడట ఆమె తండ్రి.

అప్పట్లో అల్లు అర్జున్ తన పెళ్లిని పదికోట్ల ఖర్చుతో గ్రాండ్ గా జరుపుకున్న సంగతి కూడా తెలిసిన విషయమే. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలున్నారు. షూటింగ్ లేనప్పుడు కుటుంబంతో కలసి సైట్ సీయింగ్ లు, ఫారిన్ ట్రిప్పులతో సరదాగా గడిపేస్తాడు బన్ని, స్నేహ. స్నేహ పెళ్లి తర్వాత ఓ రెస్టారెంట్, ఓ స్టూడియో పెట్టి వ్యాపారంలో కూడా దూసుకు పోతున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now