Allu Arjun : జొమాటో యాడ్‌లో న‌టించినందుకు అల్లు అర్జున్ ఎంత రెమ్యున‌రేషన్ తీసుకున్నాడో తెలుసా ?

February 5, 2022 10:00 PM

Allu Arjun : పుష్ప సినిమా ఇచ్చిన హిట్ కార‌ణంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయి న‌టుడిగా మారాడు. దీంతో ఆయ‌న‌తో హిందీలో సినిమాలు చేసేందుకు అక్క‌డి నిర్మాణ సంస్థ‌లు ఆస‌క్తిని చూపిస్తున్నాయి. ఇక ఓ త‌మిళ నిర్మాణ సంస్థ అయితే అల్లు అర్జున్‌తో సినిమా తీస్తే ఆయ‌న‌కు ఏకంగా రూ.100 కోట్ల మేర రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. కానీ అల్లు అర్జున్ ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించిన‌ట్లు స‌మాచారం.

Allu Arjun took high remuneration for zomato ads
Allu Arjun

ఇక బ‌న్నీ ప‌లు బ్రాండ్ల‌కు ఇప్ప‌టికే ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న విష‌యం విదిత‌మే. తాజాగా జొమాటో ఫుడ్ డెలివ‌రీ యాప్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారాడు. ఈ క్ర‌మంలోనే ఓ యాడ్ కూడా చేశాడు. అది ఆక‌ట్టుకునే విధంగానే ఉన్న‌ప్ప‌టికీ వివాదానికి దారి తీసింది. అయితే స‌ద‌రు జొమాటో యాడ్‌లో న‌టించినందుకు గాను అల్లు అర్జున్‌కు భారీ మొత్త‌మే రెమ్యున‌రేష‌న్‌గా ఇచ్చార‌ట‌.

మూడేళ్ల కాలానికి గాను అల్లు అర్జున్‌తో జొమాటో సంస్థ ఒప్పందం కుదుర్చుకుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ స‌మ‌యంలో అల్లు అర్జున్ జొమాటో యాడ్స్‌లో న‌టించాల్సి ఉంటుంది. అందుకు గాను ఆ సంస్థ ఏకంగా రూ.9 కోట్ల‌ను అల్లు అర్జున్‌కు ఇచ్చింద‌ట. ఇటీవ‌ల మహేష్ బాబు మౌంటెయిన్ డ్యూ సంస్థ‌కు యాడ్ చేసిన విష‌యం విదిత‌మే. ఆయ‌న 3 ఏళ్ల కాలానికి గాను రూ.10 కోట్లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అయితే అంత‌క‌న్నా ఒక కోటి మాత్ర‌మే త‌క్కువ‌గా రూ.9 కోట్ల‌ను అల్లు అర్జున్ తీసుకున్న‌ట్లు తెలిసింది. ఈ క్ర‌మంలోనే రానున్న రోజుల్లో అల్లు అర్జున్ మ‌రిన్ని జొమాటో యాడ్స్‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now