Allu Arjun : బాప్‌రే.. అల్లు అర్జున్ పారితోషికం.. రూ.100 కోట్లా..?

January 24, 2022 6:28 PM

Allu Arjun : పుష్ప: ది రైజ్ సినిమా వ‌ల్ల అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు వ‌చ్చింది. అల్లు అర్జున్‌కు ఇప్ప‌టికే క‌న్న‌డ‌, మ‌ళ‌యాళంలో మంచి పేరు ఉంది. అయితే పుష్ప మూవీ వ‌ల్ల అల్లు అర్జున్‌కు ఇండియా లెవ‌ల్‌లో పేరు ఇంకా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఏర్ప‌డ్డారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ చెప్పిన త‌గ్గేదేలే.. డైలాగ్‌తో ఆ మూవీ మ‌రింత పాపుల‌ర్ అయింది.

Allu Arjun reportedly offered rs 100 crore as remuneration for his next movie

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ దేశంలోనే అధిక డిమాండ్ ఉన్న న‌టుడిగా పేరుపొందాడు. ప్ర‌స్తుతం పుష్ప సెకండ్ పార్ట్‌లో అల్లు అర్జున్ న‌టిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక పుష్ప త‌రువాత అల్లు అర్జున్ ఏ మూవీలో న‌టిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీతో చేయ‌నున్నాడ‌ని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల్సి ఉంది.

ఇక పుష్ప సెకండ్ పార్ట్ త‌రువాత వ‌చ్చే మూవీకి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తే.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ మూవీని నిర్మిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీలో న‌టించేందుకు గాను అల్లు అర్జున్‌కు ఏకంగా రూ.100 కోట్లు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అటు మ‌రోవైపు అల్లు అర్జున్ అట్లీతో చ‌ర్చిస్తున్న‌ట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ చ‌ర్చ‌లు ఇంకా ఖ‌రారు కాలేద‌ని స‌మాచారం.

లైకా ప్రొడక్షన్స్ అందించే ఆఫ‌ర్‌కు బ‌న్నీ ఓకే చెబితే.. అప్పుడు రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన రెండో న‌టుడిగా అల్లు అర్జున్ నిలుస్తాడు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ రూ.100 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇక అట్లీ ప్ర‌స్తుతం షారుక్ ఖాన్‌, న‌య‌న‌తార‌ల కాంబినేష‌న్‌లో ల‌య‌న్ అనే మూవీని తెర‌కెక్కిస్తున్నాడు. ఆ మూవీ త‌రువాతే అల్లు అర్జున్ తో క‌లిసి మూవీ చేసే అవ‌కాశం ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now