Allu Arjun : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అల్లు అర్జున్‌.. అందుకోసమేనా ?

November 28, 2021 4:32 PM

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావడంతో ఈ సినిమాను డిసెంబర్ 17వ తేదీన ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ బాలీవుడ్ మార్కెట్ ని కూడా పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Allu Arjun : బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న అల్లు అర్జున్‌.. అందుకోసమేనా ?

ఇక ఈ సినిమా హిందీ వెర్షన్ లోనూ విడుదల కానుండడంతో అల్లు అర్జున్ పూర్తిగా ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అల్లు అర్జున్ మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పుష్ప సినిమా ప్రమోషన్‌లలో భాగంగా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 15 లో అల్లు అర్జున్ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 15 ద్వారా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తున్నారు. వివిధ భాషలలో అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. హిందీ మార్కెట్‌ను కూడా ఆకర్షించడం కోసం అల్లు అర్జున్‌ త్వరలో తన సినిమా ప్రమోషన్స్‌ కోసం అక్కడి బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now