Allu Arjun : తహ‌సీల్దార్ కార్యాలయంలో సంద‌డి చేసిన అల్లు అర్జున్

October 8, 2021 9:37 PM

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజులుగా పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఆయ‌న‌ ఎఫ్‌3 మూవీ సెట్‌కి వెళ్లి సంద‌డి చేశారు. ఆ సంద‌డికి సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. తాజాగా శంకర్ పల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సందడి చేశారు.

Allu Arjun gone to shankarpally for land registration

జనవాడ గ్రామం పరిధిలో రెండు ఎకరాల పొలం కొనుగోలు చేసిన అల్లు అర్జున్ దాని రిజిస్ట్రేషన్ కోసం శంకర్ ప‌ల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ అనంతరం తహ‌సీల్దార్ సైదులు అల్లు అర్జున్ కి ప్రోసిడింగ్ ఆర్డర్ అందజేశారు. అల్లు అర్జున్ అక్క‌డికి వ‌చ్చాడ‌ని తెలుసుకున్న అభిమానులు ఆయ‌న‌ను చూసేందుకు ఎగ‌బ‌డ్డారు.

కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతోంది.

దాక్కో దాక్కోమేక తర్వాత రెండో సింగిల్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now