Allu Arjun : అల్లు అర్జున్‌పై నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు.. కార‌ణం అదే..!

January 30, 2022 10:36 AM

Allu Arjun : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. తెలుగుతోపాటు హిందీలోనూ ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దీంతో బాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి ఈ మూవీకి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. అయితే పుష్ప సినిమాలో శ్రీ‌వ‌ల్లి పాట ఎంత హిట్ అయ్యిందో పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే ఆ పాట‌ను పాడిన సింగ‌ర్ సిద్ శ్రీ‌రామ్‌పై అల్లు అర్జున్ తాజాగా ప్ర‌శంస‌లు కురిపించాడు.

Allu Arjun  getting trolled for that

సిద్ శ్రీ‌రామ్‌కు మ్యూజిక్ అవ‌స‌రం లేద‌ని.. అత‌నే ఒక మ్యూజిక్‌.. అని అల్లు అర్జున్‌.. శ్రీ‌రామ్‌పై ప్ర‌శంస‌లు కురిపించాడు. దీంతో స్పందించిన శ్రీ‌రామ్ మాట్లాడుతూ.. నాపై మీరు కురిపించిన ప్రేమ‌, ఆప్యాయత‌ల‌కు ధ‌న్యుడిని, మీలాంటి ప్ర‌ముఖుల మాట‌ల‌కు ఎంతో విలువ ఉంటుంది, అవే నాకు ప్ర‌పంచం, న‌న్ను అభినందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.. అంటూ వ్యాఖ్య‌లు చేశాడు. అయితే ఈ మొత్తం వ్య‌వ‌హారం నెటిజ‌న్ల‌కు న‌చ్చ‌లేదు.

వాస్త‌వానికి సిద్ శ్రీ‌రామ్ త‌మిళ సింగ‌ర్‌. అత‌ని తెలుగు, త‌మిళం క‌ల‌సిపోయి ఉంటాయి. దీంతో కొన్ని సంద‌ర్భాల్లో తెలుగులోనూ త‌ప్పులు దొర్లుతుంటాయి. అది స‌హ‌జ‌మే. కానీ అల్లు అర్జున్ ఒక త‌మిళ సింగ‌ర్‌ను మెచ్చుకోవ‌డం నెటిజ‌న్ల‌కు న‌చ్చ‌లేదు. దీంతో వారు కామెంట్ల‌కు ప‌నిచెప్పారు. అల్లు అర్జున్ ఒక త‌మిళ సింగ‌ర్‌ను మెచ్చుకోవ‌డం ఏమిటి..? అత‌ను బాగా పాట‌లు పాడ‌గ‌ల‌డు.. కానీ తెలుగు స‌రిగ్గా మాట్లాడ‌లేడు.. అలాంటి వ్య‌క్తిని ఎలా మెచ్చుకుంటారు.. అంటూ విమ‌ర్శిస్తున్నారు.

అయితే టాలెంట్ ఉండాలేగానీ అందుకు భాష‌తో ప‌నిలేదు. తెలుగులో స‌రిగ్గా మాట్లాడ‌లేక‌పోయినంత మాత్రాన సిద్ శ్రీ‌రామ్‌ను నిందించాల్సిన ప‌నిలేదు, అత‌ని టాలెంట్‌ను మెచ్చుకోవాలి.. అని కొంద‌రు అత‌నికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now