Allu Arjun : అల్లు అర్జున్ మొద‌టి సినిమాకు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? షాక‌వుతారు..!

May 20, 2022 1:38 PM

Allu Arjun : మొద‌ట స్టైల్ స్టార్ గా.. ఇప్పుడు ఐకాన్ స్టార్‌గా.. ప్రేక్ష‌కులు ముద్దుగా పిలుచుకునే బ‌న్నీగా.. అల్లు అర్జున్ ఎంత‌టి గుర్తింపును పొందారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో పుష్ప 2 మూవీ కూడా విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. త్వ‌రలోనే ఈ మూవీని లాంచ్ చేయ‌నున్నారు. అయితే ప్ర‌స్తుతం భారీ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న అల్లు అర్జున్‌.. వాస్త‌వానికి ఆయ‌న మొద‌టి సినిమా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా ? తెలిస్తే షాక‌వుతారు.

అల్లు అర్జున్ త‌న సినిమా కెరీర్ ఆరంభంలో ముందుగా డాడీ మూవీలో మెగాస్టార్ తో న‌టించారు. ఒక సీన్‌లో అల్లు అర్జున్ డ్యాన్స్ బాగా చేస్తే చిరంజీవి అభినందిస్తారు. అయితే ఆ మూవీ త‌రువాత బ‌న్నీ గంగోత్రి సినిమాలో న‌టించాడు. హీరోగా అది ఆయ‌న‌కు మొద‌టి సినిమా. కె.రాఘవేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీని అశ్వ‌నీద‌త్ నిర్మించారు. అయితే ఈ మూవీ షూటింగ్‌కు ముందు బ‌న్నీ ఒక రోజు మెగా స్టార్ ఇంట్లో నిర్వ‌హించిన ఓ పార్టీ సంద‌ర్భంగా అద్భుతంగా డ్యాన్స్ చేశార‌ట‌. ఆ స‌మ‌యంలో రాఘ‌వేంద్ర రావు అక్క‌డే ఉన్నారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న బ‌న్నీ డ్యాన్స్ చూసి అబ్బుర‌ప‌డ్డారు.

Allu Arjun first movie remuneration
Allu Arjun

ఇక బ‌న్నీని గంగోత్రి సినిమాకు హీరోగా అనౌన్స్ చేస్తూ.. ఆయ‌న‌కు రాఘ‌వేంద్ర రావు రూ.100 రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు. అలా మొద‌టి సినిమాకు బ‌న్నీ అందుకుంది ముందుగా రూ.100 రెమ్యున‌రేష‌న్ అన్న‌మాట‌. త‌రువాత సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ క్ర‌మంలోనే అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ఒక్క మూవీకి రూ.45 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. పుష్ప మొద‌టి పార్ట్‌కు ఈయ‌న రూ.30 కోట్లు తీసుకున్నార‌ని టాక్‌. ఇప్పుడు పుష్ప 2 కు ఈయ‌న హిందీ హ‌క్కుల‌తోపాటు రూ.45 కోట్లు అడుగుతున్న‌ట్లు తెలుస్తోంది. అందువ‌ల్లే రెండో పార్ట్ షూటింగ్ ఆల‌స్యం అవుతున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో పుష్ప 2 ప్రారంభం కానుంది. ఇక అలా బ‌న్నీ పొందిన రూ.100 ఇప్ప‌టికీ ఆయ‌న త‌ల్లి వ‌ద్దే భ‌ద్రంగా ఉంద‌ట‌.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now