Manchu Lakshmi : మంచు ల‌క్ష్మిని అంద‌రి ముందు స్టేజిపై అలా అనేసిన అల్లు అర్జున్‌.. అందుకు ఆమె రియాక్ష‌న్‌..?

November 4, 2021 8:27 AM

Manchu Lakshmi : మా ఎన్నిక‌ల గురించి కానీ.. అందులో పోటీ చేసిన నటుల గురించి కానీ.. అల్లు ఫ్యామిలీ.. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎన్న‌డూ కామెంట్లు చేసింది లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌చారం.. త‌రువాత ఎన్నిక‌లు.. అనంత‌రం ఏర్ప‌డిన వివాదాలు.. వేటిపై కూడా అల్లు అర్జున్ స్పందించ‌లేదు. అయితే తాజాగా ఆహా 2.0 ఈవెంట్‌లో మంచు ల‌క్ష్మిని అల్లు అర్జున్ ప్ర‌త్యేకంగా సంబోధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

allu arjun comment on Manchu Lakshmi in aha 2.0 event

మంచు ల‌క్ష్మి ఇప్ప‌టికే ఆహాతో భాగ‌స్వామ్యం అయి ఓ కుకింగ్ షోను నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. మొన్నీ మ‌ధ్యే బాల‌య్య‌కు చెందిన అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే షోలో అతిథిగా పాల్గొన్నారు. ఆమె ఇంగ్లిష్‌, తెలుగు కంబైన్డ్ యాస సినీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేదు. కానీ బుల్లితెర ప్రేక్ష‌కులు మాత్రం ఆమె మాట్లాడేవిధానాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఇటీవలి కాలంలో ప‌లు కార్య‌క్ర‌మాల‌కు యాంక‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక తాజాగా నిర్వ‌హించిన ఆహా 2.0 ఈవెంట్‌కు కూడా మంచు ల‌క్ష్మి యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలో ఓ సంద‌ర్భంలో అల్లు అర్జున్‌.. మంచు ల‌క్ష్మిని ప్రెసిండ్ గారి అక్క‌.. అని సంబోంధించారు. ఇటీవ‌ల మంచు ల‌క్ష్మి సోద‌రుడు మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఆమెను ఆ విధంగా సంబోధించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

అయితే వెంట‌నే స్పందించిన మంచు ల‌క్ష్మి కూడా.. ప్రెసిడెంట్ అక్క‌డ అయితే ఏంటి.. ఎన్నో స‌మ‌స్య‌లు, వివాదాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.. అని పేర్కొంది. దీంతో ఈవెంట్‌లో న‌వ్వుల పువ్వులు పూశాయి. కాగా అల్లు అర్జున్ న‌టించిన పుష్ప మూవీ డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ హిందీ రిలీజ్ విష‌య‌మై నెల‌కొన్న వివాదాన్ని ప‌రిష్క‌రించ‌డం కోసం బ‌న్నీ స్వ‌యంగా రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment