సుకుమార్ గ‌డ్డానికి రంగు వేస్తున్న బ‌న్నీ.. పిక్చర్ అదిరింది..!

November 24, 2021 10:21 PM

ఆర్య‌, ఆర్య 2 చిత్రాల త‌ర్వాత సుకుమార్- బ‌న్నీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం పుష్ప. ఈ సినిమాకోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా.. అనే పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

allu arjun coloring sukumar beard

ఈ సినిమా నుండి ఏ అప్‌డేట్ వ‌చ్చినా కూడా ప్రేక్ష‌కులు ఇట్టే క‌నెక్ట్ అయిపోతున్నారు. తాజాగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో ఉన్న సుక్కు గడ్డానికి బన్నీ బ్రష్‌తో బ్లాక్ కలర్ వేస్తున్న ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు రాగా, అది నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది . ప్రస్తుతం ‘పుష్ప ది రైజ్ పార్ట్ -1’ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. రీసెంట్‌గా రెండు మిలియన్ల లైకులతో ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది.

పుష్పను మొత్తం రెండు భాగాలుగా విడుదల చేస్తున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 17న విడుదల కానున్న మొదటి భాగానికి పుష్ప ది రైజ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇప్పటికే ది రైజ్ ఆఫ్ పుష్పరాజ్ పేరుతో మూవీ టీమ్ టీజర్‌ను విడుదల చేసింది. తాజాగా డిసెంబర్ 2న ట్రైలర్‌ను కూడా విడుదల చేయాలని నిర్ణయించారట సుకుమార్. మరి ట్రైలర్‌లో ఈ లెక్కల మాస్టర్ ఎన్ని సర్‌ ప్రైజ్‌ ఎలిమెంట్స్ దాచాడో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now