Allu Arjun : మళ్లీ రిపీట్ కాబోతున్న త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబో..?

October 29, 2021 9:32 PM

Allu Arjun : గత ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ స్టైల్ కు, పూజా హెగ్డే అందాలకు, తమన్ స్వరాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచిందని చెప్పవచ్చు.

Allu Arjun and trivikram to do one more movie

అల వైకుంఠపురం సినిమా ప్రమోషన్‌లో భాగంగా అప్పట్లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేస్తానని చెప్పారు. అయితే తాజాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుడు కావలెను సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సంగీత దర్శకుడు తమన్, అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత నాగవంశీ దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. త్వరలోనే సర్‌ప్రైజ్‌ ఉంది అంటూ హారిక హాసిని ట్విట్టర్ ను టాగ్ చేశారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ మారడంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కానుందని తెలుస్తోంది. అయితే అల వైకుంఠపురములో సినిమా సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. లేకపోతే సరికొత్త కథతో మరోసారి ప్రేక్షకులను సందడి చేయనున్నారా.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment