Allu Arjun : క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్.. బన్నీతో బాలీవుడ్ హీరో..?

November 25, 2021 3:46 PM

Allu Arjun : మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో క్రేజీ ప్రాజెక్ట్స్ ప‌ట్టాలెక్కుతున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ అనే భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం విడుద‌ల‌కి సిద్ధం కాగా, దీనిపై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పుడు సెట్స్‌పై ప‌లు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే తాజ‌గా బ‌న్నీతోపాటు బాలీవుడ్ హీరో కాంబినేష‌న్‌లో ఓ బ‌డా మ‌ల్టీ స్టార‌ర్ రూపొంద‌నుంద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

Allu Arjun and shahid kapoor multi starrer movie may be filmed

ఇటీవ‌ల జెర్సీ హిందీ ట్రైలర్ లాంచ్ కాగా, ఈ కార్య‌క్ర‌మానికి ప్రధాన తారలు షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఊహించ‌ని విధంగా ఈ చిత్ర బృందానికి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు వేశారు. అల్లు అరవింద్ ని బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాన్ ఇండియా మల్టీస్టారర్ ను ప్లాన్ చేస్తున్నారా? అని మీడియా ప్రశ్నించింది.

అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. నా మనసులో ఆలోచన రాలేదని నేను చెప్పను, ప్రణాళికలు ఉన్నాయి. ప్రాజెక్ట్ గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ వాటి గురించి మాట్లాడటానికి ఇది సరైన స్థలం లేదా వేదిక కాదు. సమయం వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తాము” అని అన్నారు. ఆయ‌న మాట‌ల త‌ర్వాత ‘జెర్సీ’ హీరో షాహిద్ కపూర్, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో అరవింద్ ఓ మ‌ల్టీ స్టార‌ర్ చేయ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment