Allu Arjun : బ‌న్నీ మ‌ల్టీప్లెక్స్‌లో స‌రికొత్త టెక్నాల‌జీ.. ప్రతి ఒక్క‌రికీ థ్రిల్ అందించ‌డం ప‌క్కా..!

November 17, 2021 9:49 AM

Allu Arjun : టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఒక వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోవైపు మల్టీప్లెక్స్‌ లను ఏర్పాటు చేస్తున్నారు. మహేష్‌ బాబు ఇప్పటికే ఏషియన్‌ సినిమాస్ సంస్థతో కలిసి ఏఎంబీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక మహేష్‌ బాబు దారిలోనే విజయ్‌ దేవరకొండ కూడా ఏవీడీని మహబూబ్ నగర్‌ లో ఏర్పాటు చేశాడు. అల్లు అర్జున్ కూడా ఏఏఏ పేరుతో మ‌ల్టీ ప్లెక్స్ స్టార్ట్ చేస్తున్నాడు.

Allu Arjun aaa multiplex will get technology wonder

ఏషియన్‌ సంస్థతో కలిసి మల్టీ ప్లెక్స్ ను నిర్మిస్తుండ‌గా, దీనికి ఏఏఏ అంటూ పేరు కూడా పెట్టారు. ఏషియన్‌ అల్లు అర్జున్‌ సినిమాస్‌ అనేది ఈ మల్టీప్లెక్స్ పేరు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి అంటున్నారు. ప్రస్తుతం తుది దశకు పనులు చేరాయని, త్వరలోనే మల్టీప్లెక్స్ ను ప్రారంభిస్తారని అంటున్నారు. మల్టీప్లెక్స్ ను లగ్జరీయస్ డిజైన్ లతో నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

ఈ థియేట‌ర్‌లోని టెక్నాల‌జీ వండ‌ర్ పిల్లలను, పెద్లలను ఎంటర్‌టైన్ చేస్తుంద‌ట‌. లార్జ్ డిజిటల్ స్క్రీన్ మీద బన్నీ విజువల్ ఉంటుంది. దాని ముందు నిల్చున్నవారు ఏ హైట్ లో వుంటే ఆ హైట్ లోకి ఆ విజువల్ మారిపోతుంది. చిన్న పిల్లాడు ఉంటే ఆ సైజ్ లోకి, పెద్ద వాళ్లు ఉంటే పెద్ద సైజ్‌లోకి విజువల్‌ మారుతుంది.

పైగా ఆ డిజిటల్ స్క్రీన్ ముందు నిల్చున్నవారు ఎలా మూవ్ అయితే ఆ విజువల్ అలా మూవ్ అవుతుంది. ఎలా మాట్లాడితే అదే మాట్లాడుతుంది. దీనికి రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. మరి ఈ టెక్నాలజీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment