Allu Arha Birthday : అల్లు అర్హ‌కు స్పెష‌ల్ బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన అల్లు స్నేహ‌.. వైర‌ల్ వీడియో..!

November 21, 2021 1:08 PM

Allu Arha Birthday : అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్న విష‌యం విదిత‌మే. అయితే పుష్ప మూవీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌తో ఓ వైపు అల్లు అర్జున్ తీరిక లేకుండా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న కుటుంబానికి మాత్రం క‌చ్చితంగా స‌మ‌యం కేటాయిస్తారు. వారికి సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ అల్లు అర్జున్ పాల్గొంటుంటాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ త‌న కుమార్తె అర్హ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆ దంప‌తులు ఆమెకు స్పెష‌ల్ గిఫ్ట్‌ను కూడా ఇచ్చారు.

Allu Arha Birthday allu sneha reddy video post viral

అల్లు అర్జున్ ఖాళీగా కాస్తంత స‌మ‌యం దొరికినా త‌న కుటుంబానికే కేటాయిస్తారు. ఈ క్ర‌మంలోనే త‌న భార్య‌, పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తారు. అల్లు అర్జున్ భార్య స్నేహ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. త‌మ విష‌యాల‌ను ఆమె షేర్ చేస్తుంటుంది. త‌మ పిల్ల‌లు అయాన్‌, అర్హ‌ల ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే న‌వంబ‌ర్ 21న త‌మ కుమార్తె అర్హ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఓ వీడియోను స్నేహ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

https://www.instagram.com/reel/CWhhPDWlrIf/?utm_source=ig_embed&ig_rid=6c88d914-ee13-46e4-aed0-ad747c88c5ec

అల్లు అర్హ నేటితో 5 ఏళ్లు పూర్తి చేసుకుని 6వ వ‌సంతంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలోనే స్నేహ షేర్ చేసిన వీడియోలో అర్హ చెస్ ఆడ‌డాన్ని చూడ‌వ‌చ్చు. అలాగే ఆమె గేమ్‌ను అల్లు అర్జున్ కుటుంబం ఎంక‌రేజ్ చేస్తూ ఉంటుంది. త‌రువాత త‌న బ‌హుమ‌తుల‌ను చూపిస్తుంది అర్హ‌. ఈ క్ర‌మంలోనే త‌మ కుమార్తెను అల్లు అర్జున్‌, స్నేహ‌లు చూస్తుంటారు. వారంద‌రూ అర్హ‌ను ముద్దు చేస్తూ క‌నిపిస్తారు.

ఇక అల్లు అర్హ తాజాగా యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్ అవార్డును సొంతం చేసుకుంది. నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఆమెకు ఈ అవార్డును ప్ర‌దానం చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now