Allu Aravind : చ‌ర‌ణ్‌, బ‌న్నీల మ‌ధ్య ఉన్న విభేదాల‌పై ఎట్ట‌కేల‌కు నోరు విప్పిన అల్లు అర‌వింద్‌.. ఏమ‌న్నారంటే..

August 24, 2022 9:57 AM

Allu Aravind : గ‌త కొన్నేళ్లుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి , మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ కుటుంబానికి మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్ల‌కు ముగింపు వచ్చిన‌ట్టుగానే అనిపిస్తోంది. ఆగ‌స్టు 22న మెగాస్టార్ జన్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని ఒక తెలుగు న్యూస్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అల్లు అర‌వింద్ ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. అల్లు అర్జున్ 6 సంవ‌త్స‌రాల క్రితం ఒక సినిమా వేడుక లో మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను ఉద్దేశించి వారి డిమాండ్ కి బ‌దులుగా చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అని సంభోదించ‌డం జ‌రిగింది. ఇక అప్పుడు మొద‌లైన వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఇప్పుడు పుష్ప సినిమా పాన్ ఇండియా స‌క్సెస్ త‌ర్వాత అది తారా స్థాయికి చేరింది.

మెగా అభిమానులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక వ‌ర్గం వారు చిరంజీవికి హీరో రామ్ చ‌ర‌ణే అస‌లైన న‌ట వార‌సుడ‌ని ఆయ‌న‌కి మ‌ద్ద‌తుగా ఉండ‌గా, కొందరు అల్లు అర్జున్ కి మాత్ర‌మే అభిమానుల‌మ‌ని చెబుతున్నారు. రియ‌ల్ మెగాస్టార్ ఎవ‌ర‌నే విష‌యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్ వార్స్ కూడా జ‌రుగుతున్నాయి.

Allu Aravind finally opened up about differences between charan and allu arjun
Allu Aravind

ఇక అల్లు అర‌వింద్ ఒక‌ న్యూస్ ఛాన‌ల్ ఇంట‌ర్య్వూలో ఇరువురి కుంటుంబాలపై వ‌స్తున్న అపోహ‌ల‌కి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆయ‌న మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ కి దేవుడితో స‌మాన‌మ‌ని అది చివ‌రి శ్వాస వ‌ర‌కు ఉంటుంద‌ని అన్నారు. ఇంకా ఆయ‌న విభేదాల గురించి మాట్లాడుతూ.. రెండు కుటుంబాల‌లో మంచి న‌టులు ఉన్నార‌ని, విజ‌యవంతం కూడా అయ్యార‌ని అన్నారు. అంతే కాకుండా సినిమాల ప‌రంగా పోటీ ఉంటుంద‌ని, కానీ ఫ్యామిలీ విష‌యం వచ్చేస‌రికి వారంతా ఒక్క‌టే అని వివ‌రణ ఇచ్చారు. ఇకనైనా అభిమానులు ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేసి వివాదాల జోలికి వెళ్ల‌కుండా ఉంటారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now