Ali Basha : ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో ఒక్క ఎపిసోడ్ కి ఆలీ ఎన్ని లక్షలు తీసుకుంటాడో తెలుసా..?

September 24, 2022 7:04 PM

Ali Basha : టాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడు ఆలీ గురించి  ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించడమే కాకుండా మరెన్నో సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు బుల్లితెరపై తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆలీ ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా అనే సెలబ్రిటీ టాక్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో కి ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించడమే కాకుండా వారి వ్యక్తిగత, సినిమా విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే ఎంతోమంది కనుమరుగైన హీరోలను కూడా ఈ షోకి ఆహ్వానించి వారి విషయాలను ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఈ షో కి ఆలీ ఎంత పారితోషకం తీసుకుంటాడు అనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఒక్కొక్క ఎపిసోడ్ కు రూ.6.50 లక్షలు పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఆలీ ఇలా ఒక్కో ఎపిసోడ్ కు ఇంత పారితోషకం తీసుకోవడంతో అంతా షాకవుతున్నారు.

Ali Basha do you know how much he takes for his program
Ali Basha

ఇతర ఖర్చులు పోగా ఆలీకి రూ.5 లక్షల వరకు మిగులుతుందట. నెలలో 4 లేదా 5 రోజులు మాత్రమే ఆలీ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తాడు. ఇక దీని ప్రకారం చూసుకుంటే .. ఈ కార్యక్రమం ద్వారా నెలకు రూ. 20 లక్షల వరకు ఆలీ సంపాదిస్తున్నాడు. ఇది సామాన్యులకు చాలా పెద్ద అమౌంట్ అని చెప్పవచ్చు. కానీ ఆలీ లాంటి స్టార్స్ కు ఇది చిన్న అమౌంట్. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం మరింతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ షో పట్ల ప్రజల్లో మంచి ఆదరణ ఉండడమే దీనికి కారణం. ఆలీ సినిమాల విషయానికి వస్తే ఇటీవల ఎఫ్3, లైగర్ సినిమాల్లో నటించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now