Akira Nandan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవలే అకీరా నందన్ బర్త్ డేను జరుపుకోగా.. తన తండ్రికి తగినట్లే అతను రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నాడు. అలాగే మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీలోంచి కళావతి అనే సాంగ్‌ను పియానోపై వాయించి ఆశ్చర్యపరిచాడు. అకీరానందన్‌లో ఉన్న టాలెంట్ గురించి పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి మింగుడు పడని వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేమిటంటే..
ఇటీవల అకీరానందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్, రేణు దేశాయ్ ఒకే ఫ్రేములో కనిపించి అలరించారు. దీంతో వారి ఫొటో వైరల్‌గా మారింది. పవన్, రేణు దేశాయ్ చాలా రోజుల తరువాత ఒకే చోట కనిపించడం ఆయన ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిలబడ లేదు. కారణం.. అకీరా నందన్‌కు పవన్ ఇంటి పేరు కొణిదెల పెట్టకపోవడమే. అకీరానందన్‌కు తన తల్లి ఇంటి పేరు పెట్టారు. అకీరా నందన్ దేశాయ్ గా పెట్టారు. అయితే ఈ విషయం గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా తీసిన ఓ వీడియో ద్వారా వెల్లడైంది.
అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ పాటను అతను పియానోపై వాయించాడు. అయితే ఆ సందర్భంగా తెరపై అకీరా నందన్ దేశాయ్ అని కనిపించింది. దీంతో పిక్చర్ క్లియర్‌గా అర్థమైంది. అకీరా నందన్‌కు తండ్రి ఇంటి పేరు కొణిదెల పెట్టలేదని.. తల్లి ఇంటి పేరు వచ్చే విధంగా దేశాయ్ అని పెట్టడం జరిగిందని.. స్పష్టమైంది. దీంత పవన్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అయితే వాస్తవానికి పవన్.. రేణుకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి అకీరా, ఆద్యలు ఆమె దగ్గరే పెరుగుతున్నారు. అప్పుడప్పుడు పవన్‌ను కలిసేందుకు అకీరా వెళ్తుంటాడు. కనుక రేణు ఇంటి పేరునే అకీరాకు పెట్టారని అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ఈ విషయం పవన్ ఫ్యాన్స్‌కు మాత్రం కాస్త అసంతృప్తిని కలిగిస్తుందని చెప్పవచ్చు.
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…