Akhil Akkineni : అఖిల్ చేతికి రుద్రాక్ష మాల‌.. ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్..

October 16, 2021 11:55 AM

Akhil Akkineni : అక్కినేని అఖిల్ రీసెంట్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో అఖిల్ జోష్‌లో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఏజెంట్ అనే సినిమా కోసం హార్డ్ వ‌ర్క్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో అఖిల్ డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఇందుకోసం విభిన్నమైన హెయిర్ స్టైల్‌తో క‌నిపిస్తూ డిఫ‌రెంట్ డిజైన‌ర్ దుస్తుల‌లో మెరుస్తున్నాడు.

Akhil Akkineni wear a rudraksha netizen trolls

చాలా మంది ఫ్యాషన్ కోసం రుద్రాక్ష మాలను చేతికి స్టైల్ గా ధ‌రిస్తున్నారు. కొందరు హిందుత్వ వాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని.. రుద్రాక్ష అంటే శివుడి స్వరూపంగా భావిస్తాం. కనుక అలా చేయకూడదు అంటూ కొందరు అంటున్నారు. అఖిల్ కూడా రుద్రాక్ష మాలను ధరించండంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సెలబ్రెటీ రుద్రాక్ష మాలను చేతికి చుట్టుకోవడం ద్వారా ఇది అంద‌రికీ అల‌వాటు చేసిన వార‌వుతారు అని మండిప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా అఖిల్ క్లారిటీ ఇచ్చాడు. రుద్రాక్ష‌ చేతికి ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని ఒకరు చెప్పారు. అందుకే ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి తాను తన చేతికి ధరించినట్లుగా చెప్పుకొచ్చాడు. అఖిల్ భక్తితోనే రుద్రాక్షను ధరించడం అంటూ క్లారిటీ ఇవ్వడంతో ట్రోల్స్‌ కాస్త ఆగాయ‌ని చెప్పాలి. అఖిల్ న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొంద‌గా, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమాలో అఖిల్ విభిన్నమైన పాత్రను పోషించాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now