Akhil Akkineni : విరాట్ కోహ్లి బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉంది.. మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టిన అఖిల్‌..

October 13, 2021 8:14 AM

Akhil Akkineni : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డెల కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీకి చెందిన టీజ‌ర్స్‌, సాంగ్స్‌, ట్రైల‌ర్స్‌కు అభిమానుల నుంచి విశేష రీతిలో స్పంద‌న ల‌భించింది. అఖిల్ భిన్న‌మైన లుక్ లో క‌నిపించ‌డ‌మే కాక‌.. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అల‌రిస్తుంద‌ని చిత్ర ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

Akhil Akkineni says he wants to act in virat kohli biopic

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మూవీకి గాను చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేసింది. టాలీవుడ్‌లో అడుగు పెట్టిన 6 ఏళ్లు అవుతున్నా అఖిల్‌కు మాత్రం ఒక్క హిట్ కూడా ద‌క్క‌లేదు. దీంతో చాలా క‌సిగా ఈ మూవీని చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ మూవీతో అయినా విజ‌యం సాధించాల‌ని అఖిల్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాడు.

కాగా ఓ మీడియాసంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. బ‌యోపిక్స్ లో న‌టించాల‌ని ఉంద‌ని తెలిపాడు. క‌పిల్‌దేవ్ కు చెందిన బ‌యోపిక్ త‌న‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ని.. అందుక‌ని త‌న‌కు విరాట్ కోహ్లి బ‌యోపిక్ చేయాల‌ని ఉంద‌ని.. అఖిల్ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. అఖిల్ కూడా నిజానికి క్రికెట్ బాగా ఆడ‌తాడు. సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్ జ‌రిగిన‌ప్పుడు అఖిల్ క్రికెట్ ఎలా ఆడాడో అంద‌రం చూశాం. అందుక‌నే త‌న‌కు విరాట్ కోహ్లి బ‌యోపిక్ తీస్తే అందులో ప్ర‌ధాన పాత్ర చేయాల‌ని ఉంద‌ని తెలిపాడు. మ‌రి అత‌నికి ఆ అవ‌కాశం వ‌స్తుందా, రాదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now