Akhil Akkineni : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ సక్సెస్ అనంతరం అక్కినేని అఖిల్ చాలా జోరు మీద ఉన్నాడు. చాలా రోజుల తరువాత ఒక మూవీ హిట్ కావడంతో అఖిల్ ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఏజెంట్ సినిమాకు చెందిన పలు ముఖ్యమైన సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అందులో బాగంగానే ఈ మూవీ షూటింగ్‌ను మనాలి పరిసరాల్లో కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూవీలోంచి అఖిల్‌కు చెందిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. అందులో అఖిల్ హాలీవుడ్ హీరోలా కనిపిస్తుండడం విశేషం.
అఖిల్‌కు చెందిన ఈ ఫొటోలో అఖిల్ డబుల్ జాకెట్ ధరించి ఉన్నాడు. మంచు కొండల్లో పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రింగుల జుట్టుతో వెనుక చిన్నపాటి పోనీ టెయిల్ జుట్టును పెట్టుకుని అఖిల్ చాలా హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. ఈ ఫొటోలో అఖిల్‌ను చూస్తుంటే హాలీవుడ్ హీరో కిట్ హారింగ్‌టన్ గుర్తుకు వస్తున్నాడని అఖిల్ ఫ్యాన్స్ అంటున్నారు. కిట్ హారింగ్‌టన్ ప్రముఖ టీవీ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ద్వారా పాపులర్ అయ్యాడు. అందులో ఆయన జాన్ స్నో అనే పాత్రలో అలరించారు. అందులో జాన్ స్నో పాత్రలో కూడా రింగుల జుట్టుతో కనిపిస్తాడు. అలాగే కిట్‌కు అఖిల్‌కు ముఖంలో పోలికలు కూడా ఒకేలా ఉన్నాయి. దీంతో కిట్ హారింగ్‌టన్‌తో అఖిల్‌ను పోలుస్తున్నారు. అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నావని అఖిల్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.
ఇక అఖిల్ ఏజెంట్ మూవీలో మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. ఈమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. ఆగస్టు 12వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. గూఢచారి నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్‌ను చూస్తే తెలుస్తోంది. దీంతో అఖిల్ సీక్రెట్ ఏజెంట్‌గా ఎలా కనిపిస్తాడోనని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…