Radhika Apte : రక్త చరిత్ర మొదటి పార్ట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. రాధికా ఆప్టే. ఆ తరువాత ఈమెకు తెలుగులో పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో లెజెండ్ మూవీ ఒకటి. ఇది హిట్ అయినప్పటికీ రాధికా ఆప్టేకు మళ్లీ ఆఫర్లు రాలేదు. అయినప్పటికీ ఈమె మరాఠీ, బెంగాలీ, హిందీ భాషలకు చెందిన సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అయితే గతంలో ఓ చిత్రంలో బోల్డ్ సీన్లలో నటించిన ఈ బ్యూటీ సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఈమెకు పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు. అయినప్పటికీ రాధికా ఆప్టే తనకు వచ్చిన ఆఫర్లను కాదనకుండా చేస్తోంది.
ఇక రాధికా ఆప్టే సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. ఈమె గ్లామర్ షో కేవలం సినిమాలకే పరిమితం. ఇతర హీరోయిన్లలా సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేయదు. కానీ ఫాలోవర్లు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. ఇక రాధికా ఆప్టే తాజాగా సర్జరీలు చేయించుకునే హీరోయిన్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొందరు సర్జరీలు వద్దు అంటూనే చేయించుకుంటారని.. సహజసిద్ధమైన అందం అంటే వారికి నచ్చదని రాధికా కామెంట్స్ చేసింది.
కొందరు హీరోయిన్లు తమ శరీరంలో భాగాలను అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకుంటారని.. కానీ అలా చేయడం తన వల్ల కాదని రాధికా ఆప్టే పేర్కొంది. అలాంటి వారిని చూడాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుందని కామెంట్స్ చేసింది. అయితే శరీరానికి సర్జరీలు చేయించుకునేవారు చెప్పే మాటలను విని విసిగిపోయానని కూడా ఆమె తెలియజేసింది. కాగా రాధికా ఆప్టే ప్రస్తుతం విక్రమ్ వేదా అనే సినిమాలో నటిస్తుండగా ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే ఈమె నటించిన ఫోరెన్సిక్ అనే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న మోనికా, ఓ మై డార్లింగ్ అనే మూవీలోనూ ఈమె నటిస్తోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…