Akhil Akkineni : అక్కినేని అఖిల్ చాలా రోజుల తరువాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో హిట్ కొట్టాడు. ఇందులో అఖిల్‌కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డె నటించింది. అయితే పూజా వల్లే సినిమా హిట్ అయిందని అన్నారు. దీంతో పేరు మొత్తం ఆమెకే వెళ్లింది. కానీ అఖిల్ యాక్టింగ్ అయితే ఇందులో సూపర్బ్‌గా ఉందని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా అఖిల్ పాత్రను ఇందులో తీర్చిదిద్దారు. అయితే అఖిల్ త్వరలోనే ఏజెంట్‌గా మన ముందుకు రానున్నాడు. గూఢచారి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అఖిల్ అక్కినేని నటిస్తున్న ఏజెంట్ సినామా ఆగస్టు 12వ తేదీన విడుదల కానుంది. ఆ రోజు భారీ ఎత్తున థియేటర్లలో ఈ మూవీని విడుదల చేయనున్నారు. ఇందులో మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇంకో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ ఇంకా రిలీజ్ కానేలేదు.. అప్పుడే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను కైవసం చేసుకుంది. దీంతో అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ ఇటీవలే కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు అఖిల్ ఏజెంట్ సినిమా హక్కులను కూడా పొందింది. ఇక మూవీ ఆగస్టు 12న రిలీజ్ అవుతుంది కనుక సెప్టెంబర్ 12 తరువాత ఏజెంట్ మూవీ ఓటీటీలో విడుదల అవుతుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…