Akhanda Pre Release Event : తెలుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌కి బాల‌య్య రిక్వెస్ట్..!

November 28, 2021 8:40 AM

Akhanda Pre Release Event : అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ రంగానికి అండగా నిలవాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కరోనా కారణంగా.. దాదాపుగా రెండేళ్ల పాటు టాలీవుడ్ ఇబ్బందుల్లో పడిందని.. ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలు వస్తున్నాయని చెప్పిన బాలయ్య.. అందరు హీరోల సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకున్నారు. ప్రభుత్వాల అండతో.. సినీ రంగం కోలుకోవాలని అన్నారు.

Akhanda Pre Release Event : తెలుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రుల‌కి బాల‌య్య రిక్వెస్ట్..!
Akhanda Pre Release Event

స్పీచ్ మొద‌ట్లో తనకు అలవాటైన రీతిలో శ్లోకాలు, బీజాక్షరాలు, నవ విధాన పూజలను అలవోకగా పఠించారు. ఈ క్రమంలో తనపై తానే జోక్ విసురుకున్నారు. ప్రస్తుతం ఆహా ఓటీటీలో షో చేస్తున్నానని, ఇదే విధంగా భవిష్యత్తులో ఓ భక్తి చానల్‌లో ప్రవచనాల తరహాలో ఓ షో చేస్తానని చమత్కరించారు. ఒక్కో మాట కలిస్తే అక్షరం అవుతుంది. అక్షరాలు కలిస్తే మంత్రం అవుతుంది. మంత్రాల ఔన్నత్యాన్ని, నవ పూజల విశిష్టతను చాటిచెప్పే చిత్రమిది. భక్తితత్వాన్ని ఎన్నో సినిమాలతో నాన్నగారు బతికించారు. ఆ పంథాను నమ్మి నేను చేసిన సినిమా ఇది.

నాన్న ఎన్టీఆర్‌ను నేను గురువుగా, దైవంగా భావిస్తా. ఆ తర్వాత నా అభిమానుల్ని ప్రేమిస్తాను. నా నుంచి ఏదీ ఆశించకుండా కష్టాల్లో నాకు అండగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తున్నది అభిమానులే. జయాపజయాల దైవాధీనాలు. విజయాలను చూసి గర్వపడను. పరాజయాల్ని చూసి ఏ రోజూ కృంగిపోను.

కోవిడ్‌ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి ఈ సినిమా చేశాం. ‘అఖండ’తోపాటు అల్లు అర్జున్‌ ‘పుష్ప’, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలు విజయవంతం కావాలి. సినీ పరిశ్రమకు అండగా నిలవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతున్నా’ అని బాల‌కృష్ణ‌ తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now