Akhanda Movie : త్వరలో ఓటీటీలో బాలయ్య అఖండ మూవీ.. ఎప్పుడంటే..?

December 8, 2021 7:16 PM

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఫ్లాపులు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బోయ‌పాటి శ్రీను ఆప‌ద్భాంద‌వుడిలా క‌నిపిస్తున్నాడు. గ‌త కొంత కాలంగా బాల‌య్య ఫ్లాపుల‌తో స‌త‌మతం అవుతుండ‌గా.. అఖండ చిత్రంతో బాల‌య్య రేంజ్‌ని మ‌ళ్లీ పెంచాడు బోయ‌పాటి. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వచ్చిన‌ సింహా సినిమా, లెజెండ్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి బూస్ట్ ఇచ్చాయి. ఇక మళ్లీ ఏడేళ్ల తర్వాత వచ్చిన అఖండ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.

Akhanda Movie to release in OTT very soon

క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోయినా బాలయ్య సరికొత్త గెటప్‌లో కనిపించడం, పోరాట ఘట్టాలు, డైలాగ్స్‌ అదిరిపోవడంతో ‘అఖండ’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్‌ని రాబట్టింది. కేవలం వారం రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వ‌ర‌లో ఈ మూవీ ఓటీటీలో సంద‌డి చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసుకోవాలనే అగ్రిమెంట్ చేసుకోగా, ఈ సినిమా జనవరి 1 లేదా 2 తేదీలలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అఖండ స్ట్రీమింగ్ కానుంది.  దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ డిసెంబర్ ఎండింగ్ లో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now