Akhanda Movie : ఓటీటీలోనూ స‌రికొత్త రికార్డును సృష్టించిన అఖండ‌..!

January 24, 2022 10:54 AM

Akhanda Movie : నంద‌మూరి బాలకృష్ణ‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌నుల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ మూవీ హ్యాట్రిక్ విజ‌యాన్ని అందించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యాన్ని సాధించింది. క‌లెక్ష‌న్ల రికార్డుల‌ను సృష్టిస్తూ ముందుకు సాగింది. అయితే ఇటీవ‌లే ఈ మూవీ 50 రోజుల‌ను కూడా పూర్తి చేసుకుంది.

Akhanda Movie sensational hit on OTT also

తాజాగా అఖండ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అయింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో అఖండ‌ను స్ట్రీమ్ చేశారు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా అఖండ మూవీ స‌రికొత్త రికార్డుల‌ను సృష్టించింది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్య‌ధిక సంఖ్య‌లో ప్రేక్ష‌కులు వీక్షించిన తెలుగు మూవీగా అఖండ రికార్డును క్రియేట్ చేసింది.

అఖండ మూవీకి మిరియాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌గా.. ఓటీటీలోనూ ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ప్ర‌గ్యా జైశ్వాల్ ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించింది. పూర్ణ మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. శ్రీ‌కాంత్ ఈ మూవీలో విల‌న్‌గా న‌టించి మెప్పించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now