Akhanda Movie : బాల‌య్య ఉగ్ర రూపం అఖండ‌.. హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న మూవీ..!

January 22, 2022 1:03 PM

Akhanda Movie : నంద‌మూరి బాల‌కృష్ణ ద్విపాత్రాభిన‌యంలో న‌టించిన అఖండ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బంప‌ర్ హిట్ సాధించింది. ఈ మూవీ క‌లెక్ష‌న్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్ప‌టికే 100కు పైగా సెంట‌ర్ల‌లో 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేసింది.

Akhanda Movie now streaming in disney plus hotstar app

ప్ర‌ముఖ ఓటీటీ యాప్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ప్ర‌స్తుతం అఖండ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్ష‌కులు ఈ మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో త‌మ‌న్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎంతో హైలైట్‌గా నిలిచింద‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమా స్టోరీలైన్ కూడా అద్భుతంగా ఆక‌ట్టుకుంది. బాల‌కృష్ణ అఖండ రూపంలో మ‌రోమారు వెండి తెర‌ను షేక్ చేశారు.

బోయపాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అఖండ మూవీ అటు మాస్ ప్రేక్ష‌కుల‌నే కాక‌, ఇటు క్లాస్ ప్రేక్ష‌కుల‌ను కూడా ఎంతో ఆక‌ట్టుకుంది. ఈ మూవీలో బాల‌య్య ప‌క్క‌న ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. జ‌గ‌ప‌తి బాబు కీల‌క‌పాత్రలో న‌టించి మెప్పించారు.

డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్ లో ప్ర‌స్తుతం అఖండ మూవీని స్ట్రీమ్ చేస్తున్నారు. ఈ యాప్‌లో అఖండ మూవీని చూసి ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now