Akhanda : అఘోరాగా గ‌ర్జించిన బాల‌య్య‌.. ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పిస్తున్న టైటిల్ సాంగ్..!

November 8, 2021 8:31 PM

Akhanda : బాల‌కృష్ణ సినిమాల‌కు మాస్‌లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం అఖండ కోసం అంద‌రూ క‌ళ్ల‌ప్ప‌గించి చూస్తున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను – నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ అఖండ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్ర టైటిల్‌ సాంగ్ టీజర్‌ని దీపావళి సందర్భంగా రిలీజ్ చేసి రికార్డులు తిరగరాశారు. తాజాగా టైటిల్ ట్రాక్ ఫుల్ సాంగ్ వదిలారు.

Akhanda balakrishna roars in the film fans are very much happy

‘ఖం ఖం ఖంగుమంది శంఖం.. భం అఖండ.. భం భం అఖండ..’ అంటూ సాగిన ఈ పాటలో అఘోరాగా బాలయ్య చాలా పవర్ ఫుల్ గా ఉన్నారు. త్రిశూలం పట్టుకుని, నుదుటికి విభూది రాసుకొని విధ్వంసకరంగా కనిపించారు. ఈ పాటను శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్ ఆలపించ‌గా, థమన్ కట్టిన బాణీలు శ్రోత‌ల‌కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్ లో అఖండ గర్జన ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుందనడంలో సందేహం లేదు. ‘అఖండ’ టైటిల్ సాంగ్‌ విజువల్ గా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోందని హింట్ ఇచ్చారు.

https://youtu.be/9n1refHexDY

సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌ – బోయ‌పాటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న అఖండ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా నటించగా జగపతి బాబు, శ్రీకాంత్, పూర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త్వ‌ర‌లో బాల‌కృష్ణ‌.. గోపీచంద్ మ‌లినేనితో క‌లిసి యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీ చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now